హైదరాబాద్ : సీబీఐ, ఈడీ కోర్టులో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. పెన్నా కేసుల‌కు సంబంధించి అనుబంధ ఛార్జిషీటు పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఏ2 నిందితుడు విజయసాయిరెడ్డి నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. అలాగే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ కేసులో గత శుక్రవారం ఏడుగురు నిందితులకు న్యాయస్థానం సమన్లు జారీ చేసింది. ఈ రోజు విచారణకు ఏపీ సీఎం జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన న్యాయవాదులు కోరారు. దీంతో సీఎం జగన్‌కు సీబీఐ న్యాయస్థానం వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్