ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో హైపర్‌ కమిటీ భేటీ ముగిసింది. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో సీఎంతో సమావేశమైన హైపర్‌ కమిటీ జీఎన్‌రావు, బీసీజీ నివేదికలను పరిశీలించింది. అలాగే రాజధాని రైతుల సమస్యలపై కమిటీ సభ్యులు జగన్‌తో చర్చించారు. ఇప్పటికే మూడు సార్లు సమావేశమైన హైపర్‌ కమిటీ సభ్యులు జీఎన్‌ రావు, బీసీజీ నివేదికలపై విస్తృతంగా చర్చించిన సంగతి తెలిసిందే. కాగా, గత సమావేశాలకు సంబంధించి వివరాలను ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. అమరావతి రైతుల నుంచి సీఆర్డీఏ అభిప్రాయాలను సేకరిస్తోంది. ఇప్పటికే 3100 మంది రైతులు వారివారి అభిప్రాయాలను వెల్లడించారు.

 

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.