జ‌న‌వ‌రి 31 నుంచి రెండు రోజుల పాటు బ్యాంకుల సేవ‌లు నిలిచి పోనున్నాయి. దాని ప్ర‌భావం ఏటీఎం పైనా ప‌డనుంది. విడతలవారీగా చేపట్టనున్న జాతీయ స్థాయి సమ్మెకు సంబందించి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(బ్యాంక్ ఉద్యోగ యూనియన్ల ఉమ్మడి ఫోరం-యూఎఫ్‌బీయూ) గురువారం కీలక ప్రకటన చేసింది. వేతన సవరణపై భారతీయ బ్యాంకుల సంఘం(ఐబిఎ)తో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగ సంఘ ప్రతినిధులు తెలిపారు. దీంతో పాటు మార్చి నెలలో సైతం మూడు రోజులు సమ్మె చేస్తామని బ్యాంకు సంఘాలు ప్రకటించాయి.

ఈ తేదీల్లో బ్యాంకులు పనిచేయవు..

బ్యాంక్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. డిమాండ్లు నెరవేరకుంటే మార్చిలో వరుసగా మూడు రోజులు(11, 12, 13 తేదీల్లో), ఏప్రిల్ 1న కూడా విధులు బహిష్కరిస్తామని ఉద్యోగుల యూనియన్ల ఉమ్మడి ఫోరం తెలిపింది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.