ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్..
By Newsmeter.Network Published on 17 Jan 2020 11:03 AM ISTజనవరి 31 నుంచి రెండు రోజుల పాటు బ్యాంకుల సేవలు నిలిచి పోనున్నాయి. దాని ప్రభావం ఏటీఎం పైనా పడనుంది. విడతలవారీగా చేపట్టనున్న జాతీయ స్థాయి సమ్మెకు సంబందించి యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్(బ్యాంక్ ఉద్యోగ యూనియన్ల ఉమ్మడి ఫోరం-యూఎఫ్‌బీయూ) గురువారం కీలక ప్రకటన చేసింది. వేతన సవరణపై భారతీయ బ్యాంకుల సంఘం(ఐబిఎ)తో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉద్యోగ సంఘ ప్రతినిధులు తెలిపారు. దీంతో పాటు మార్చి నెలలో సైతం మూడు రోజులు సమ్మె చేస్తామని బ్యాంకు సంఘాలు ప్రకటించాయి.
ఈ తేదీల్లో బ్యాంకులు పనిచేయవు..
బ్యాంక్ ఉద్యోగుల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో బ్యాంకులు పనిచేయవు. డిమాండ్లు నెరవేరకుంటే మార్చిలో వరుసగా మూడు రోజులు(11, 12, 13 తేదీల్లో), ఏప్రిల్ 1న కూడా విధులు బహిష్కరిస్తామని ఉద్యోగుల యూనియన్ల ఉమ్మడి ఫోరం తెలిపింది.
Also Read
ఇకపై ఓయో దృష్టి లాభార్జనపైనేNext Story