న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 9 July 2020 3:41 PM IST
భారత ఆర్మీ సంచలన నిర్ణయం.. 89 యాప్‌లు తొలగింపు
భారత్‌లో యాప్‌ల బ్యాన్ కొనసాగుతోంది. ఇప్పటికే జిత్తులమారి డ్రాగన్.. చైనాకు సంబంధించిన టిక్‌టాక్ సహా 59 యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. వాటిని ప్లే స్టోర్ నుంచి తొలగించింది కేంద్రం సర్కార్. భారత్ – చైనా సరిహద్దుల్లో చోటు చేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ తనదైన శైలిలో చైనాకు దడపుట్టిస్తోంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఆ ఊళ్లో కరోనా కట్టడికి కమాండోలు రంగంలోకి దిగారు.. అక్కడేం జరిగింది?
రోజుకు తొమ్మిది వందల పాజిటివ్ కేసులు వచ్చే హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా పదిహేను వందలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అధికారిక సమాచారం వెలువడినంతనే మహానగర ప్రజలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేకున్నా.. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల వాణిజ్యం సంస్థలు మొదలు పలు కాలనీ సంఘాలు అప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకోవటం షురూ చేశాయి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
నిందలు పడ్డ ఆ నలుగురే.. ఇప్పుడు నష్టాల్లో..
టాలీవుడ్లో తరచుగా ‘ఆ నలుగురు’ అంటూ ఓ మాట వినిపిస్తూ ఉంటుంది. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకనపుడు.. వాటి నిర్మాతలు మీడియా ముందుకు వచ్చి నలుగురు సినీ పెద్దలు థియేటర్లన్నింటినీ తమ గుప్పెట్లో పెట్టుకుని చిన్న సినిమాలకు అవకాశం లేకుండా చేస్తున్నారని.. తమ సినిమాలు, తమకు నచ్చిన వాళ్ల సినిమాలకే థియేటర్లు కేటాయిస్తూ ఇండస్ట్రీని శాసిస్తున్నారని ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తుంటారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
మహేంద్రుడి రిటైర్‌మెంట్‌పై మేనేజర్ క్లారిటీ
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) నిరవదికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అసలు ఈ ఏడాది ఐపీఎల్ ఉంటుందా..? అని సందేహాలు మొదలైన వేళ.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలి బుధవారం చేసిన ప్రకటన క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాది ఐపీఎల్ 13వ సీజన్ ని నిర్వహించి తీరుతామని స్పష్టం చేశాడు. ఆస్ట్రేలియా వేదికగా.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
త్వరలో చైనా ఒంటరైపోతుంది: అమెరికా విదేశాంగ మంత్రి
భారత్‌తో సరిహద్దు విషయంలో చైనా దూకుడు వ్యవహరిస్తోందని, అందుకు భారత్ కూడా అదే స్థాయిలో బదులిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో అన్నారు. గత నెలలో గాల్వన్ ఘటన గురించి భారత్ విదేశాంగ మంత్రి జైశంకర్‌తో పలు మార్లు మాట్లాడినట్లు ఆయన చెప్పారు. చైనా చాలా దూకుడు వ్యవహరిస్తోందని, అందుకు భారత్ కూడా తన వంతుగా ధీటుగానే బదులిస్తోందని అన్నారు. కాగా, చైనా సరిహద్దుల విస్తరణకు సంబంధించి పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
మానవత్వం మీ రూపంలో బ్రతికే వుంది.. వీడియో వైరల్
ఆధునిక యాంత్రిక జీవనంలో మనకోసం మనం ఆలోచించడంతోనే సరిపెట్టుకుంటున్న ఈ రోజుల్లో.. పక్కవారి గురించి ఆలోచించే సాహసం ఏ మాత్రం చేయం. పక్కవాడు ఏమైపోతే ఏంటి.. అని వదిలేస్తాం. కానీ ఓ మహిళ చేసిన పని ఇప్పుడు అందరిని కదిలిస్తుంది. జీవితంలో కనీసం ఓ క్షణమైనా సాటివారి గురించి పాటుపడాలనే ఆలోచనను కలిగిస్తుంది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
ఏపీలో 24వేలకు చేరువలో కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతి రోజు రికార్డు సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 16,882 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 1555 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 1500 మంది కాగా..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
‘ఈరోజుల్లో’ ఫేం శ్రీ ఇంట్లో విషాదం..
కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా మరో సెలబ్రెటీ ఇంట్రో తీవ్ర విషాదం నెలకొంది. ‘ఈ రోజుల్లో’ ఫేం హీరో శ్రీ.. తండ్రి కరోనా కాటుకు బలయ్యారు. ఈ వార్త ఒక్కసారిగా అందరిని షాక్‌కు గురి చేసింది. ఆయన తండ్రి మంగం వెంకట దుర్గా రాంప్రసాద్ కోవిడ్ మహమ్మారి బారీన పడడంతో గత 20 రోజులుగా విజయవాడలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
80 మంది టీటీడీ సిబ్బందికి కరోనా వైరస్
ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరిగిపోతోంది. ప్రతి రోజు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళనకరంగా మారుతోంది. అయితే అన్‌లాక్‌లో 1 తర్వాత తిరుమల శ్రీవారి ఆలయం తెరుచుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి స్వామి వారి దర్శనాలకు భక్తులను అనుమతిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో టీటీడీ సిబ్బంది సైతం కరోనా బారిన పడుతున్నారు..పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
జూలై 10 నుంచి మళ్లీ లాక్‌డౌన్!
దేశంలో కరోనా వైరస్ తీవ్రస్థాయిలో వ్యాపిస్తోంది. దేశ వ్యాప్తంగా ప్రతి రోజు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా, వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రాజధాని పట్నాలో ఓ వారం రోజుల పాటు లాక్‌డౌన్ విధించాలని జిల్లా అధికారులు నిర్ణయించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి