కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా మరో సెలబ్రెటీ ఇంట్రో తీవ్ర విషాదం నెలకొంది. ‘ఈ రోజుల్లో’ ఫేం హీరో శ్రీ.. తండ్రి కరోనా కాటుకు బలయ్యారు. ఈ వార్త ఒక్కసారిగా అందరిని షాక్‌కు గురి చేసింది. ఆయన తండ్రి మంగం వెంకట దుర్గా రాంప్రసాద్‌ కోవిడ్‌ మహమ్మారి బారీన పడడంతో గత 20 రోజులుగా విజయవాడలోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి ఆయన పరిస్థితి విషమించడంతో.. రాత్రి 8.30గంటలకు కన్నుమూశారు. కాగా.. దుర్గా రాం ప్రసాద్‌ మృతితో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. శ్రీ తండ్రి మృతికి ప‌లువురు టాలీవుడ్ న‌టులు సంతాపం వ్య‌క్తం చేశారు.

శ్రీ అసలు పేరు శ్రీనివాస్‌ మంగం. మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘ఈ రోజుల్లో’ చిత్రంతో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతరువాత ‘లవ్‌సైకిల్‌’, ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్‌’, ‘సాహసం సేయరా డింబకా’.. వంటి చిత్రాల్లో నటించాడు. ఇటీవలే తెలుగు చిత్ర నిర్మాత పోకూరి రామారావు కరోనాతో మరణించిన విషయం తెలిసిందే.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.