మహేష్ బాబుతో ఆయన ప్రయాణం.. ఇప్పటిది కాదు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  8 July 2020 10:52 AM GMT
మహేష్ బాబుతో ఆయన ప్రయాణం.. ఇప్పటిది కాదు..!

బుధవారం నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు తన మేకప్ ఆర్టిస్ట్ పట్టాభికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తనతో పాటూ ఎంతో కాలంగా ఉన్న పట్టాభితో కలిసి ఉన్న ఫోటోను మహేష్ ఇంస్టాగ్రామ్ లో పోస్టు చేశారు. 44 సంవత్సరాల మహేష్ బాబు తన మేకప్ కు మెరుగులు దిద్దే పట్టాభి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని కోరారు.

“Happy Birthday Pattabhi 🤗 From extensive shoot hours to the last minute touch-ups, he’s the man who's always been there! Wishing you happiness and many blessings😊🙏” అంటూ పోస్టు పెట్టారు మహేష్.

తన పర్సనల్ స్టాఫ్ కు ఎప్పటికప్పుడు మహేష్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు. 2018 లో కూడా “Posing with the evergreen Superstar :) :) He’s been with me for the past 24 years. Can't face the camera without him :) No photoshop.. my favourite colour..my man in blue - Pattabhi :) :)” అంటూ పోస్టు పెట్టాడు మహేష్ బాబు. దాదాపు 24 ఏళ్లుగా మహేష్ బాబుతో పట్టాభి ప్రయాణం చేస్తూ ఉన్నారు. 2017 లో పట్టాభి ఇంటి గృహ ప్రవేశానికి కూడా మహేష్ వెళ్లిన సంగతి తెలిసిందే.

లాక్ డౌన్ సమయంలో మహేష్ బాబు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉన్నారు. తన పిల్లలతో ఉన్న ఫోటోలను, ఇంట్లో చోటుచేసుకున్న ఘటనలను ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు. ట్విట్టర్ లో మహేష్ బాబు 10 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు.

మహేష్ బాబు ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరూ' సినిమా ద్వారా సక్సెస్ అందుకున్నారు. తన తర్వాతి సినిమా 'సర్కారు వారి పాట' అని స్పష్టం చేశారు మహేష్. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదల అయింది. గీతా గోవిందం సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు పరశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. కీర్తి సురేష్ మహేష్ బాబు సరసన మొదటిసారి నటించబోతోంది. కరోనా కేసులు తగ్గగానే సినిమా షూటింగ్ కు వెళ్లాలని సర్కారు వారి పాట చిత్ర యూనిట్ భావిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న మోసాల చుట్టూ ఈ సినిమా సాగుతుందని.. అందుకు సంబంధించిన స్టోరీ లైన్ కూడా సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

Next Story