రజినీకాంత్ డిశ్చార్జ్‌పై బులిటెన్ విడుదల
Rajinikanth Discharged from Hospital Today. మిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి తాజాగా
By Medi Samrat Published on 27 Dec 2020 3:54 PM IST
తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ ఆరోగ్యంపై అపోలో ఆస్పత్రి తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని బులిటెన్‌లో తెలిపింది. ఆయనకు సంబంధించి అన్ని వైద్య పరీక్షల రిపోర్ట్స్ వచ్చాయని.. అంతా సవ్యంగానే ఉన్నట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. రక్తపోటు సాధారణ స్థితికి చేరుకుందని.. ఇప్పుడు ఆయన ఆరోగ్యం మునుపటి స్థితికి చేరుకుందని తెలిపారు. ఈ క్రమంలోనే డాక్టర్లు రజినీకాంత్ ను మరికాసేపట్లో డిశ్చార్జ్ చేయనున్నారు. అందుకోసం ఆస్పత్రి సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.
అయితే.. రజనీకి డాక్టర్లు పలు సూచనలు చేశారు. ఓ వారం పాటు పూర్తిగా విశ్రాంతి అవసరమని తెలిపారు. అలాగే ఒత్తిడిని జయించేందుకు వ్యాయామం అవసరమని సూచించారు. ఇదిలావుంటే.. రెండు రోజుల చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం మరింత మెరుగైందని ఆస్పత్రి యాజమాన్యం ఉదయం మీడియా బులిటెన్‌లో పేర్కొంది.
ఇదిలావుంటే.. 'అన్నాత్తే' సినిమా షూటింగ్ నిమిత్తం ఆయన ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఘాటింగ్ జరుగుతుండగా.. చిత్ర యూనిట్‌లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో చిత్ర షూటింగ్ ను వాయిదా వేశారు. వెంటనే రజినీకాంత్ కూడా క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. సంక్రాంతి కల్లా 'అన్నాత్తే' సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి.. రాజకీయాల్లో బిజీ కావాలనుకున్న రజనీకాంత్ అనుకోకుండా అస్వస్థతకు గురయ్యారు. 25న అపోలో ఆసుత్రిలో చేరారు.