ఈడీ, సీబీఐలను సాధనాలుగా బీజేపీ మార్చుకుంది..రాహుల్‌గాంధీ హాట్ కామెంట్స్

రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..ఈడీ, సీబీఐలను ఉపయోగించుకుంటోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు

By -  Knakam Karthik
Published on : 23 Dec 2025 10:52 AM IST

National News, Rahulgandhi, Congress, Bjp, Central Government, CBI, ED, Political opponents

ఈడీ, సీబీఐలను సాధనాలుగా బీజేపీ మార్చుకుంది..రాహుల్‌గాంధీ హాట్ కామెంట్స్

రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం..ఈడీ, సీబీఐలను ఉపయోగించుకుంటోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. గత వారం జర్మనీ రాజధాని బెర్లిన్‌లోని హెరిటై స్కూల్లో విద్యార్థులతో జరిగిన సంభాషణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గంటపాటు నిడివి ఉన్న వీడియోను కాంగ్రెస్ సోమవారం విడుదల చేసింది. భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలనే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఆ పార్టీని అధికారం నుంచి తొలగించడంలో విజయం సాధించే ప్రతిఘటన వ్యవస్థను సృష్టిస్తామని ప్రతిజ్ఞ చేశారు. దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థపై పూర్తిస్థాయిలో దాడి చేస్తోందని ఆరోపించారు. సంస్థలన్నింటినీ తన రాజకీయ శక్తిని పెంచుకునే సాధనాలుగా మార్చుకుందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

'బీజేపీ ప్రతిపాదిస్తున్నది రాజ్యాంగాన్ని తొలగించడం. రాష్ట్రాలు, భాషాలు, మతాల మధ్య మధ్య సమానత్వం, ప్రతి వ్యక్తికి కల్పించిన సమాన విలువ అనే రాజ్యాంగ మూల సూత్రాలనే తొలగించాలనే ప్రయత్నం జరుగుతోంది. అంతేకాకుండా సంస్థలన్నింటినీ బీజేపీ తన చేతుల్లోకి తీసుకుంది. మేం బీజేపీతో మాత్రమే పోరాడటం లేదు. భారత్​ సంస్థల నిర్మాణాన్ని బీజేపీ ఆక్రమించుకున్న విధానానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. ప్రజాస్వామ్యంపై దాడి జరిగినప్పుడు కేవలం ఎన్నికలపై ప్రశ్నలు లేవనెత్తడం సరిపోదు. దానిని ఎదుర్కొవడానికి మార్గాలు కనుగొనాలి. మేం దీన్ని ఎదుర్కొంటాం. బీజేపీని అధికారంలో నుంచి తప్పించేలా పనిచేసే ప్రతిపక్ష ప్రతిఘటన వ్యవస్థను నిర్మిస్తాం' అని రాహుల్ గాంధీ చెప్పారు.

Next Story