గుడ్‌న్యూస్‌ : రైతుల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ ఆర్థిక సాయం.. విడుద‌ల చేసిన‌ మోదీ

PM Modi releases instalment of financial benefit under PM Kisan. ప్రధాని నరేంద్ర మోదీ 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (PM Kisan)

By Medi Samrat  Published on  9 Aug 2021 8:34 AM GMT
గుడ్‌న్యూస్‌ : రైతుల ఖాతాల్లోకి పీఎం-కిసాన్ ఆర్థిక సాయం.. విడుద‌ల చేసిన‌ మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' (PM Kisan) ప‌థ‌కం కింద 9వ విడత నిధులను విడుదల చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమ‌వారం సుమారు రూ. 19,500 కోట్ల నిధులను విడుదల చేశారు. ఈ పథకం ద్వారా 9.75 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ది చేకూరనుంది. కేంద్రం పీఎం-కిసాన్‌ పథకం కింద.. సంవత్సరానికి 6000/- రూపాయల ఆర్థిక ప్రయోజనం అర్హత కలిగిన లబ్ధిదారు రైతు కుటుంబాలకు ఇస్తోంది.

అయితే.. ఈ సాయాన్ని మూడు వాయిదాలలో.. నాలుగు నెలలకు ఓసారి 2000 రూపాయల చొప్పున రైతులకు అందిస్తారు. ఈ మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు ట్రాన్స్ ఫర్ చేశారు. ఈ పథకం ద్వారా ఇప్పటివరకూ 1.38 లక్షల కోట్ల రైతు కుటుంబాలు లబ్దిపొందాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో పాటు పలువురు రైతులు పాల్గొన్న‌ వీడియో కాన్ఫరెన్స్ లో మోదీ వ్యవసాయ రంగం గురించి చర్చించారు.

ఇలా చేయండి..

మొదటిగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి హోమ్ పేజీ pmkisan.gov.in కి వెళ్లి.. ఆ తర్వాత హోమ్ పేజీలో ఉన్న 'లబ్ధిదారుని స్థితి' ట్యాబ్‌పై క్లిక్ చేయండి. తెరుచుకునే విండోలో, ఏదైనా ఎంపికను ఎంచుకోండి – ఆధార్ నంబర్, ఖాతా సంఖ్య లేదా మొబైల్ నంబర్. ఎంచుకున్న ఎంపికను ఎంచుకున్న తర్వాత, 'డేటాను పొందండి' పై క్లిక్ చేయండి. డేటా మీ కంప్యూటర్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. లేదా అక్కడే కనిపించే 'పీఎం కిసాన్ బెనిఫిసియరీ స్టేటస్' డైరెక్ట్ లింక్‌పై క్లిక్ చేయాలి.


Next Story