జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాద దాడి జరగవచ్చని ఇంటెల్ నివేదిక ప్రధాని నరేంద్ర మోదీకి ముందే అందిందని, ఆ తర్వాత ఆయన కేంద్రపాలిత ప్రాంతానికి తన పర్యటనను రద్దు చేసుకున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. ఏప్రిల్ 22న పహల్గామ్ దాడి జరగడానికి మూడు రోజుల ముందు ప్రధానికి ఇంటెల్ నివేదిక పంపారని ఖర్గే చెప్పారు.
పహల్గామ్ ఘటనలో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉంది, ప్రభుత్వం దానిని అంగీకరించిందని ఖర్గే అన్నారు. దాడి జరుగుతుందని ముందే తెలిసి కూడా వారు ఎందుకు ఏమీ చేయలేదు? దాడికి మూడు రోజుల ముందు, ప్రధాని మోదీకి ఇంటెలిజెన్స్ నివేదిక పంపబడిందని తనకు సమాచారం అందిందని ఖర్గే తెలిపారు. ఈ కారణాల వలన ఆయన కశ్మీర్ తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారని ఒక వార్తాపత్రికలో చదివాననని ఖర్గే అన్నారు. పహల్గామ్‌లో ఉన్న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిలో నిఘా వైఫల్యం ఉందని ప్రభుత్వం అంగీకరించిందని ఖర్గే అన్నారు.