బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులపై బకెట్లతో డబ్బుల వర్షం కురిపించారు..!

గుజరాత్‌లోని జునాగఢ్‌లోని మొగల్‌ధామ్‌లో చైత్ర నవరాత్రుల సందర్భంగా భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు

By Medi Samrat  Published on  11 April 2024 5:30 PM IST
బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులపై బకెట్లతో డబ్బుల వర్షం కురిపించారు..!

గుజరాత్‌లోని జునాగఢ్‌లోని మొగల్‌ధామ్‌లో చైత్ర నవరాత్రుల సందర్భంగా భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జానపద గాయకులు కీర్తిదాన్ గాధ్వి, జిగ్నేష్ కవిరాజ్ పాల్గొన్నారు. కార్యక్రమంలో జానపద కళాకారులతో పాటు బీజేపీ అభ్యర్థి రాజేష్ చూడాసమా, కాంగ్రెస్ అభ్యర్థి హీరాభాయ్ జోత్వాల‌పై డబ్బుల వర్షం కురిపించారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై వారి మద్దతుదారులు బకెట్ల నిండా కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు.

చైత్ర నవరాత్రుల మొదటి రోజు జునాగఢ్‌లోని మొగల్‌ధామ్‌లో అమ్మవారిని పూజించారు. అనంతరం రాత్రి మొగల్‌ధామ్‌లో భారీ జానపద డయారా నిర్వహించారు. ఈ డయారాలో గుజరాత్‌లోని ప్రముఖ డయారా కళాకారులు కీర్తిదాన్ గాధ్వి, రాజ్‌భా గాధ్వి, జిగ్నేష్ కవిరాజ్ సహా వివిధ కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించారు.

ఈ డయారాలో కళాకారులపై లక్షల రూపాయల వర్షం కురిసింది. కళాకారులపై 100, 500 రూపాయల నోట్ల వర్షం కురిపించారు. ఎమ్మెల్యే దేవ్‌భాయ్ మలం, బీజేపీ జునాగఢ్ లోక్‌సభ అభ్యర్థి రాజేష్ చుడాసమా, కాంగ్రెస్ అభ్యర్థి హీరాభాయ్ జోత్వాతో సహా పలువురు ప్రముఖ సాధువులు, ఋషులు ఈ గ్రాండ్ జానపద డయారాలో పాల్గొన్నారు.


Next Story