బీజేపీని ఓడించాలంటే జరగాల్సింది అదే : ప్రశాంత్ కిషోర్
Only a second front can defeat BJP. దేశంలో ఏ తృతీయ, నాలుగో ఫ్రంట్ వచ్చినా ఎన్నికల్లో విజయం సాధిస్థాయని
By Medi Samrat Published on 30 April 2022 11:25 AM GMTదేశంలో ఏ తృతీయ, నాలుగో ఫ్రంట్ వచ్చినా ఎన్నికల్లో విజయం సాధిస్థాయని తాను నమ్మడం లేదని.. బీజేపీని ఓడించాలంటే రెండో ఫ్రంట్ తో మాత్రమే సాధ్యమని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పార్టీ టిఎంసి మూడవ ఫ్రంట్‌గా ఆవిర్భవించడానికి మీరు సహాయం చేస్తున్నారా అని అడిగినప్పుడు ఆయన మాట్లాడుతూ.. "దేశంలో మూడో ఫ్రంట్ లేదా నాలుగో ఫ్రంట్ ఎన్నికల్లో విజయం సాధించగలదని నేను ఎప్పుడూ నమ్మలేదని, బీజేపీని మొదటి ఫ్రంట్‌గా పరిగణిస్తే.. ఆ పార్టీని ఓడించాలంటే రెండో ఫ్రంట్ కావాల్సిందేనని, ఏ పార్టీ అయినా బీజేపీని ఓడించాలనుకుంటే.. రెండవ ఫ్రంట్‌గా ఆవిర్భవించాలి." అని అన్నారు. కాంగ్రెస్‌ను సెకండ్ ఫ్రంట్‌గా భావిస్తున్నారా అని ఆయన్‌ను ప్రశ్నించగా.. దేశంలోనే రెండో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.
కాంగ్రెస్ పార్టీకి తానిచ్చిన లీడర్‌షిప్ ఫార్ములాలో రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ పేర్లు కానీ లేవని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి పీకే లాంటి వాళ్ల అవసరం లేదని, ఆ పార్టీ నిర్ణయాలను తీసుకోగలదని అన్నారు. మీడియా నన్ను అవసరానికి మించి పెద్దగా చూపిస్తోంది. నా స్థాయి అంత పెద్దది కాదన్నారు. రాహుల్ గాంధీ నాపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారు. కాంగ్రెస్‌కు పీకే అవసరం లేదని.. సొంత నిర్ణయాలను తీసుకోగలదని ప్రశాంత్ కిషోర్ చెప్పుకొచ్చారు.