Viral Video : కొడుకును చంపడానికి కత్తులతో వచ్చారు.. తల్లి ఎలా ఎదురు తిరిగిందంటే..!

పట్టపగలు కత్తితో తన కొడుకు మీద దాడి చేయాలని ప్రయత్నించిన వారిని ఓ తల్లి అడ్డుకున్న ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది

By Medi Samrat  Published on  19 Aug 2024 6:11 PM IST
Viral Video : కొడుకును చంపడానికి కత్తులతో వచ్చారు.. తల్లి ఎలా ఎదురు తిరిగిందంటే..!

పట్టపగలు కత్తితో తన కొడుకు మీద దాడి చేయాలని ప్రయత్నించిన వారిని ఓ తల్లి అడ్డుకున్న ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. ఓ తల్లి ధైర్యంగా వేగంగా స్పందించి తన కుమారుడి ప్రాణాలను కాపాడింది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం 1:30 గంటల ప్రాంతంలో కొల్హాపూర్‌లోని జైసింగ్‌పూర్ ప్రాంతంలో జరిగింది. మొత్తం సీసీటీవీలో రికార్డయింది.

వైరల్ షాకింగ్ వీడియోలో.. ఒక వ్యక్తి తన స్కూటర్‌పై రోడ్డు పక్కన కూర్చుని, తన తల్లితో కబుర్లు చెబుతున్నాడు. కొద్దిసేపటికే ముగ్గురు వ్యక్తులు స్కూటర్‌పై వచ్చి అతనిపై కత్తితో దాడికి యత్నించారు. అయితే ఆ దాడి నుంచి ఆ వ్యక్తి తృటిలో తప్పించుకున్నాడు. ఆ వ్యక్తి తల్లి వెంటనే స్పందించి, దాడి చేసిన వారిపై విసరడానికి రాయిని తీసుకుంటుంది. వెంటనే, ఆమె కొడుకు కూడా ఎదురు తిరిగి.. దాడికి దిగిన వారిని తరిమికొట్టాడు. ఈ ఘటనకు సంబంధించి దాడికి పాల్పడిన ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వీరి మధ్య గతంలో తగాదాలు ఉన్నాయని తెలుస్తోంది.

Next Story