ఎదురు తిరిగిన జనం.. పారిపోయిన పోలీసులు.. ఎక్కడంటే?

Madhya Pradesh Cops Run For Cover As Huge Mob Attacks Police Team. ఎలాంటి సందర్భాలైనా జనాలను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు.

By Medi Samrat  Published on  4 Feb 2023 2:15 PM GMT
ఎదురు తిరిగిన జనం.. పారిపోయిన పోలీసులు.. ఎక్కడంటే?

ఎలాంటి సందర్భాలైనా జనాలను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎంతగానో ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొన్ని కొన్ని సార్లు ప్రజలు దూకుడుగా ప్రవర్తిస్తే పోలీసులు కూడా పారిపోవాల్సి వస్తుంది. అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో శుక్రవారం సాయంత్రం భారీ గుంపు పోలీసులు, పరిపాలన బృందంపై దాడి చేసింది. ఈ ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు.. పోలీసు కారును ధ్వంసం చేశారు. సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ సంజయ్ సాహు నేతృత్వంలోని బృందం ఉజ్జయిని జిల్లాలోని జితార్ ఖేడి గ్రామంలో ప్రభుత్వ భూమిలోని ఆక్రమణలను తొలగించేందుకు వెళ్లగా, ఒక గుంపు పోలీసులపై దాడి చేసింది. అంతేకాకుండా ఆక్రమణలను తొలగించడానికి ఉపయోగించిన బుల్డోజర్‌పై రాళ్లు రువ్వడం ప్రారంభించారు.

ఈ ఘటనలో బుల్‌డోజర్, ఒక పోలీసు కారు భారీగా ధ్వంసమయ్యాయి. రాళ్ల దాడి నుండి తమను తాము కాపాడుకోడానికి అధికారులు మరొక పోలీసు వాహనంలో వెళ్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించి వీడియోలలో, స్థానిక నివాసితులతో కూడిన భారీ గుంపులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. పారిపోతున్న పోలీసులపై విచక్షణారహితంగా రాళ్లు రువ్వడం చూడవచ్చు. ఒక వీడియో క్లిప్‌లో, మహిళలు బుల్‌డోజర్‌పై రాళ్లు విసరడం, దాని కిటికీలను పగులగొట్టడం చూడవచ్చు.

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం సమీపంలోని జితార్ ఖేడి గ్రామంలోని 6,000 చదరపు అడుగుల ప్రభుత్వ భూమిని ఆక్రమించారు. గతంలో ఈ భూమిలో అన్ని వర్గాల కార్యక్రమాలు నిర్వహించేవారని, అయితే ఆక్రమణలకు గురికావడంతో అన్నీ ఆగిపోయాయని గ్రామస్తులు తెలిపారు. ఫిర్యాదు మేరకు ఎస్‌డిఎం సాహు నేతృత్వంలోని బృందం గ్రామానికి చేరుకుని ఆక్రమణలను తొలగిస్తూ ఉండగా గ్రామస్తులు దాడి చేశారు.


Next Story