భోపాల్: బీజేపీ ఫైర్‌బ్రాండ్, మాజీ కేంద్ర మంత్రి ఉమాభారతిని సోమవారం నాడు మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కలిశారు. తన అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు స్వాగతం పలికారు. ఉమా భారతి శివరాజ్‌కి పుష్పాలు సమర్పించి అతని నుదుటిపై 'తిలకం' రాసి స్వాగతం పలికింది. ఆమెను 'దీదీ' అని సంబోధించిన చౌహాన్.. తమ మధ్య ఇప్పుడు అంతా బాగానే ఉందని తెలిపే ప్రయత్నం చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో శివరాజ్ సింగ్ చౌహాన్ ఆశీర్వాదం కోసం ఉమా భారతి పాదాలను తాకారు.
"కొత్త ఎక్సైజ్ పాలసీ తర్వాత మొదటిసారిగా, నేను శివరాజ్ జీని నా ఇంటికి ఆహ్వానించాను.. ఎక్సైజ్ పాలసీలో మధ్యప్రదేశ్ మొత్తం దేశంలోనే మోడల్ రాష్ట్రంగా మారినందుకు మహిళల తరపున అభినందించాను" అని ఉమా భారతి తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో రాశారు. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముందు ఆరోగ్య కారణాలను పేర్కొంటూ 2018లో పదవుల నుండి ఉమా భారతి వైదొలిగారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి రాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ తన స్థానాన్ని నిలబెట్టుకోడానికి పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు పలువురు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.