భారత్‌లో ఓమిక్రాన్‌ డేంజర్‌ బెల్స్‌.. భారీగా పెరిగిన కేసులు

India's Omicron tally surges to 961. భారత్‌లో ఓమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్‌ కేసుల సంఖ్య వేయ్యికి చేరువలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో (263),

By అంజి  Published on  30 Dec 2021 5:08 AM GMT
భారత్‌లో ఓమిక్రాన్‌ డేంజర్‌ బెల్స్‌.. భారీగా పెరిగిన కేసులు

భారత్‌లో ఓమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్‌ కేసుల సంఖ్య వేయ్యికి చేరువలో ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో (263), మహారాష్ట్ర (252)లో గరిష్ట కేసులు నమోదైనప్పటికీ.. భారతదేశంలో మొత్తం ఓమిక్రాన్ కేసులు 961కి పెరిగాయి. అనేక రాష్ట్రాలు బుధవారం రోజువారీ కోవిడ్ -19 కేసులలో విపరీతమైన పెరుగుదలను చూశాయి. తాజా కోవిడ్-19 కేసులతో దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 3,48,22,040కి చేరింది. ఇక గుజరాత్‌లో 97, రాజస్థాన్‌లో 69, కేరళలో 65, తెలంగాణలో 62 ఓమిక్రాన్‌ కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. ఇప్పటి వరకు నమోదైన ఓమిక్రాన్ కేసుల్లో 320 మంది బాధితులు కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

భారతదేశంలో గత 24 గంటల్లో 13,154 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో 263, మహారాష్ట్రలో 252 కేసులతో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 961కి పెరిగింది. భారత దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 82,402 వద్ద ఉంది. పెరుగుతున్న కోవిడ్-19 కేసుల దృష్ట్యా ముంబైలో ఈరోజు (గురువారం, డిసెంబర్ 30) నుండి జనవరి 7, 2022 వరకు సెక్షన్ 144 విధించబడింది. కొత్త సంవత్సర వేడుకలు, రెస్టారెంట్లు, హోటళ్లు, బార్‌లు, పబ్‌లు, రిసార్ట్‌లు, క్లబ్‌లతో సహా మూసి లేదా బహిరంగ ప్రదేశంలో పార్టీలు డిసెంబర్ 30 నుండి జనవరి 7 వరకు నిషేధించబడ్డాయి.

జనవరి 1వ తేదీ ఉదయం 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు చెన్నై రోడ్లపై వాహనాలను అనుమతించబోమని చెన్నై పోలీసులు ప్రకటించారు. ప్రజలు డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి 12 గంటల లోపు ఇళ్లకు చేరుకునేలా చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ప్రజలు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు బయటకు వచ్చారు. మినహాయింపు ఉంటుంది. కొత్త సంవత్సరం సందర్భంగా నగరవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు.

అమెరికాలో కరోనా కొత్త కేసులు రికార్డు స్థాయిలో రోజుకు సగటున 2,65,000 కంటే ఎక్కువ స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అధిపతి ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story