ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లోని పునరావాస కేంద్రంలో తనపై సామూహిక అత్యాచారం జరిగిందని ఓ బాలిక ఆరోపించింది. బాలికపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రిషికేశ్‌లో పునరావాస కేంద్రంలోని బాధిత బాలికకు ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా.. స్నేహంగా మారింది.
"కొన్ని రోజుల తర్వాత అతడు బాలికకు మత్తుమందు కలిపిన శీతల పానీయం అందించాడు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు ఆమెపై అత్యాచారం చేశారు. ఆమెకు సంబంధించి అసభ్యకరమైన వీడియోలు, ఫోటోలను తీశారు. ఆమెను బెదిరిస్తూ పలు మార్లు అత్యాచారం చేశారు" అని పోలీసులు చెప్పారు. లైంగిక వేధింపులతో విసిగిపోయిన బాలిక నిందితుడిని అరెస్టు చేయాలని సీనియర్ పోలీసు అధికారికి లేఖ పంపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.