నేటి సాయంత్రం ప్రధాని మోదీ సెక్యూరిటీ మీట్

ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 1న కీలక భేటీని నిర్వహించనున్నారు.

By -  Medi Samrat
Published on : 1 April 2026 3:04 PM IST

నేటి సాయంత్రం ప్రధాని మోదీ సెక్యూరిటీ మీట్

ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 1న కీలక భేటీని నిర్వహించనున్నారు. ఇరాన్ యుద్ధ పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి కేబినెట్ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఈ సమావేశం సాయంత్రం 7 గంటలకు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా మారుతున్న పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. మార్చి 22న జరిగిన గత సీసీఎస్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ సంఘర్షణ వల్ల పరిస్థితులు మారుతూ ఉంటాయని, దీని ప్రభావం యావత్ ప్రపంచంపై ఏదో ఒక రూపంలో పడుతోందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంఘర్షణ ప్రభావం నుండి పౌరులను కాపాడటానికి అన్ని విధాలా ప్రయత్నించాలని సూచించారు.

Next Story