ప్రధాని మోదీకి వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో వెలసిన పోస్టర్లు దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా ‘మోడీ హఠావో దేశ్ బచావో’ పేరుతో నగరంలోని పలు ప్రాంతాల్లో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. వీటిపై చర్యలకు ఉపక్రమించిన ఢిల్లీ పోలీసులు, ఇప్పటివరకు 100 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ కేసులో ఆరుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నామని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు. పోస్టర్లకు సంబంధించి ఆప్ పార్టీ కార్యాలయం నుంచి బయటకు వస్తోన్న ఓ వ్యానును పోలీసులు అడ్డుకుని, అందులో ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు. వ్యానులో ఉన్న కొన్ని వేల పోస్టర్లను సైతం సీజ్ చేశారు. ఈ ఘటనలో ప్రింటింగ్ ప్రెస్‌కు సంబంధించిన సమాచారం ఆ పోస్టర్లపై లేదని ఢిల్లీ పోలీస్ ప్రత్యేక కమిషనర్ దీపేంద్ర పాఠక్ తెలిపారు. ఇప్పటి వరకు
ప్రధానికి వ్యతిరేకంగా అంటించిన 2వేల పోస్టర్లను తొలగించామని చెప్పారు. ప్రధాని మోదీపై పోస్టర్ల వ్యవహారంపై పోలీసుల చర్యను ఆమ్‌ఆద్మీ పార్టీ తప్పుబట్టింది.