కోవిడ్‌తో స్కూళ్ల మూసివేత‌.. డుమ్మా కొట్టిన 27.85 ల‌క్ష‌ల‌ మంది విద్యార్థులు

Covid-19 impact.. Schools' closure hit 320 million kids. కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు మూసివేడం.. విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించింది. సుమారు 32 కోట్ల మంది విద్యార్థులు

By అంజి  Published on  11 Dec 2021 12:07 PM IST
కోవిడ్‌తో స్కూళ్ల మూసివేత‌.. డుమ్మా కొట్టిన 27.85 ల‌క్ష‌ల‌ మంది విద్యార్థులు

కరోనా మహమ్మారి కారణంగా పాఠశాలలు మూసివేడం.. విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపించింది. సుమారు 32 కోట్ల మంది విద్యార్థులు ప్రీ-ప్రైమరీ నుండి తృతీయ స్థాయి వరకు ప్రభావితం చేసింది. మహమ్మారి ప్రభావాన్ని మహిళా సాధికారతపై పార్లమెంటరీ కమిటీకి విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. "బేటీ బచావో, బేటీ పఢావో"పై తన నివేదికను కమిటీ శుక్రవారం పార్లమెంటుకు సమర్పించింది. కోవిడ్ కారణంగా పాఠశాలల మూసివేత వల్ల ప్రభావితమైన 32 కోట్ల మంది విద్యార్థుల్లో 15.8 కోట్ల మంది అమ్మాయిలు ఉన్నట్లు తెలిపింది. కరోనా నుంచి తేరుకున్న తర్వాత బాలికలు చాలా వరకు చదువులకు దూరం అయ్యే ఛాన్స్‌ ఉన్నట్లు అంచనా వేశారు.

మహమ్మారి కౌమారదశలో ఉన్న బాలికలను అసమానంగా ప్రభావితం చేస్తుందనే ఆందోళనలు పెరుగుతున్నాయని అధికారులు తెలిపారు. మహమ్మారి ముగిసన తర్వాత చాలా మంది బాలిలకలు శాశ్వతంగా పాఠశాల నుండి తప్పుకునే ప్రమాదంతో పాటు, ఇటీవలి సంవత్సరాలలో సాధించిన లాభాలను తిప్పికొట్టడానికి దారి తీస్తుందని తన నివేదికలో పేర్కొంది. లెర్నింగ్‌కి డిజిటల్‌ యాక్సోస్‌లో జెండర్‌ డైమెన్షన్‌ ఉందనే వాస్తవాన్ని కూడా విస్మరించలేరు. ఇక ఒకే ఒక్క స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ఇళ్లలో బాలికలు ఆన్‌లైన్‌ విద్యకు దూరం అవుతున్నారు.

"సర్వశిక్షా అభియాన్ కింద గత సంవత్సరం ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డులో బడి బయట పిల్లల సంఖ్య పెరగడాన్ని మేము చూశాము. 2020 నుండి 2021 వరకు, 10 లక్షల మంది చిన్నారులు స్కూల్‌కు రాలేదు. కానీ ప్రస్తుత సంవత్సరంలో మొత్తం 27.85 లక్షల మంది విద్యార్థులు స్కూల్‌ డుమ్మా కొట్టారు. "అని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాంటి పిల్లలను ట్రాక్ చేస్తున్నారు. వారిని పాఠశాలల్లోకి చేర్చడానికి బ్రిడ్జ్ కోర్సును ప్రవేశపెట్టారు.

Next Story