ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. 'ఆప్‌'ను నిందితుల జాబితాలో చేర్చే యోచ‌న‌లో ఈడీ

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కఠినమైన ప్రశ్నలు వేసింది.

By Medi Samrat  Published on  16 Oct 2023 1:55 PM GMT
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు.. ఆప్‌ను నిందితుల జాబితాలో చేర్చే యోచ‌న‌లో ఈడీ

ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు కఠినమైన ప్రశ్నలు వేసింది. బెయిల్ దరఖాస్తుపై విచారణ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన డివిజన్ బెంచ్, సిసోడియాపై అభియోగాలపై చర్చ ఎందుకు ప్రారంభించలేదని.. ఎప్పుడు జరుగుతుందని ఈడీని ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని నిందితుల జాబితాలో చేర్చే అంశాన్ని ఈడీ, సీబీఐ పరిశీలిస్తున్నాయని ఈడీ తరపున ఎఎస్‌జి రాజు కోర్టుకు తెలిపారు. సిసోడియా బెయిల్ పిటిషన్‌పై విచారణ మంగళవారం కూడా కొనసాగుతుంది.

మనీష్ సిసోడియాపై అభియోగాలపై చర్చ ఎందుకు ప్రారంభించలేదని సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది. ఒకరిని నిరవధికంగా జైల్లో ఉంచలేమని కోర్టు పేర్కొంది. మీరు ఎప్పుడు వాదించగలరో మీకు ఖచ్చితంగా తెలియదని చుర‌క‌లు అంటించింది.

ఎక్సైజ్ పాలసీ కుంభకోణం కేసులో ఆప్‌ని నిందితుల జాబితాలో చేర్చే అంశాన్ని ఈడీ పరిశీలిస్తోందని ఈడీ తరఫున హాజరైన అడిష‌న‌ల్‌ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్‌ ఎస్‌వి రాజు తెలిపారు. దీనిపై న్యాయమూర్తి మాట్లాడుతూ.. అది వేరే నేరమని అన్నారు. దీనిపై ఏఎస్జీ మాట్లాడుతూ.. ఇదే కేసు అని చెప్పారు. ఈడీ కేసులో ఇది ప్రత్యేక నేరమా లేక అదే నేరమా? రేపు దీనికి సమాధానం చెప్పండని ధ‌ర్మాస‌నం ఆదేశించింది.

Next Story