జమ్ముకశ్మీర్‌లో 40 చోట్ల సీబీఐ దాడులు..!

CBI raids IAS Shahid Choudhary's Srinagar house in illegal arms licensing case. తుపాకీ లైసెన్స్ కుంభకోణం కేసు జమ్ముకశ్మీర్‌ ను

By Medi Samrat
Published on : 24 July 2021 4:01 PM IST

జమ్ముకశ్మీర్‌లో 40 చోట్ల సీబీఐ దాడులు..!

తుపాకీ లైసెన్స్ కుంభకోణం కేసు జమ్ముకశ్మీర్‌ ను కుదిపేస్తోంది. జమ్మూ కాశ్మీర్ లోని 40 చోట్ల సీబీఐ శనివారం దాడులు చేసింది. ఎన్నికల్లో పోటీ చేసిన ఐఏఎస్ అధికారి షాహిద్ చౌదరితో పాటు పలువురు అధికారులకు చెందిన ప్రాంతాల్లో సీబీఐ సోదాలు చేస్తూ ఉంది. కథువా, రియాసి, రాజౌరి, ఉధంపూర్ జిల్లాల డిప్యూటీ కమిషనర్‌గా చౌదరి పనిచేశారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నకిలీ పేర్లలో వేలాది తుపాకీ లైసెన్సులు జారీ చేసినట్లు చౌదరిపై ఆరోపణలు ఉన్నాయి.

చౌదరి 2009 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ప్రస్తుతం గిరిజన వ్యవహారాల విభాగం అడ్మినిస్ట్రేటివ్‌ సెక్రెటరీ పదవిలో ఉన్నారు.తుపాకీ లైసెన్స్‌ల కుంభకోణం కేసుకు సంబంధించి ఎనిమిది మంది మాజీ డిప్యూటీ కమిషనర్లను కూడా సీబీఐ విచారిస్తోంది. జమ్ముకశ్మీర్‌ ఐఏఎస్ అధికారి షాహిద్ ఇక్బాల్ చౌదరి నివాసం సహా 40 ప్రాంతాల్లో సీబీఐ శనివారం ఉదయం దాడులు చేసింది. రాజస్థాన్ ఏటీఎస్ ఈ కుంభకోణాన్ని 2017 లో బయటకు తీసి 50 మందికి పైగా నిందితులను అరెస్టు చేసింది.

ఆర్టీ సిబ్బంది పేరిట 3 వేలకు పైగా పర్మిట్లు ఇచ్చినట్లు ఏటీఎస్ తేల్చింది. అప్పటి జమ్ముకశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా ఈ కేసులో దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. జమ్మూ, శ్రీనగర్, ఉధంపూర్, రాజౌరి, అనంతనాగ్, బారాముల్లా, ఢిల్లీతో సహా 40 చోట్ల సిబిఐ సెర్చింగ్ ఆపరేషన్లను నిర్వహించింది. అప్పటి ప్రభుత్వ ఉద్యోగుల (ఐఎఎస్ అధికారులతో సహా) మరికొందరికి చెందిన ప్రాంతాలను కేంద్ర ఏజెన్సీ సెర్చ్ చేసింది. తాజాగా ఏదైనా కేసు నమోదైందా లేదా అన్న విషయం సిబిఐ చెప్పలేదు.


Next Story