పాఠశాలల్లో 'సూర్య నమస్కారాలు' వద్దు

AIMPLB Opposes Centre Over Surya Namaskar Program In Schools. దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలల్లో 'సూర్య నమస్కార్' కార్యక్రమాన్ని నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఆల్

By అంజి  Published on  4 Jan 2022 2:13 PM IST
పాఠశాలల్లో సూర్య నమస్కారాలు వద్దు

దేశ 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాలల్లో 'సూర్య నమస్కార్' కార్యక్రమాన్ని నిర్వహించాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) మంగళవారం వ్యతిరేకించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను పురస్కరించుకుని జనవరి 1 నుంచి 7 వరకు దేశవ్యాప్తంగా పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే, ఏఐఎమ్‌పిఎల్‌బి ఈ చర్యను వ్యతిరేకించింది. 'సూర్య నమస్కార్' అనేది సూర్య పూజ (సూర్యుడిని ఆరాధించడం) యొక్క ఒక రూపం. ఇస్లాం దానిని అనుమతించదని వారు చెబుతున్నారు.

అన్ని తర్కాలను ధిక్కరిస్తూ, ఏఐఎమ్‌పిఎల్‌బి ప్రధాన కార్యదర్శి మౌలానా ఖలీద్ సైఫుల్లా రహ్మానీ ఒక ప్రకటనలో.. భారతదేశం లౌకిక దేశమని, మెజారిటీ కమ్యూనిటీ యొక్క ఆచారాలను అన్ని మతాలపై 'మోపడం' సాధ్యం కాదని అన్నారు. సూర్య నమస్కార కార్యక్రమాన్ని బహిష్కరించాలని ముస్లిం విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఇస్లామిక్ నిబంధనలను గురించి చెబుతూ.. సూర్య నమస్కార కార్యక్రమంలో పాల్గొనకుండా ముస్లిం విద్యార్థులకు పిలుపునిచ్చారు.

యోగాసన సాధన ద్వారా ఫిట్‌నెస్ సంస్కృతిని సృష్టించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ సోమవారం సూర్య నమస్కార్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర ఆయుష్ మంత్రి సర్బానంద సోనోవాల్ మాట్లాడుతూ.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాల "ఆజాదీ కా అమృత్ మహోత్సవ్" నివాళికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో హార్ట్‌ఫుల్‌నెస్ ఇంటర్నేషనల్ యోగా అకాడమీకి ఆయన శంకుస్థాపన చేశారు. '75 కోట్ల సూర్యనమస్కార్ ఛాలెంజ్' 21 రోజుల సూర్యనమస్కార్ ఛాలెంజర్‌ని పూర్తి చేసిన తర్వాత ప్రతి పార్టిసిపెంట్ కూడా సర్టిఫికేట్‌ను అందుకోవడంతో అతిపెద్ద సమ్మేళన సూర్య నమస్కార్ ఈవెంట్‌ను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది.

Next Story