ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం 6 నెలల్లో ఉండదు, కొత్త ప్రభుత్వం పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల వారిది అవుతుంది" అని సోమవారం బీహార్‌లో జరిగిన ఓటరు అధికార్ యాత్ర ముగింపు సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఖర్గే అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బిహార్ నుంచి మోదీ, బీజేపీని తరిమికొట్టాలని ఖర్గే అన్నారు.
కాగా సోమవారం పాట్నాలో జరిగిన 'ఓటు అధికార్ యాత్ర' ముగింపు సందర్భంగా జరిగిన మార్చ్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ఎల్ఓపీ, పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, బీహార్ పార్టీ అధ్యక్షుడు రాజేష్ రామ్, బీహార్ అసెంబ్లీలో ఎల్ఓపీ, ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ పాల్గొన్నారు.