5.1 తీవ్ర‌త‌తో అస్సాంలో భూకంపం..!

అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.

By -  Medi Samrat
Published on : 5 Jan 2026 8:40 AM IST

5.1 తీవ్ర‌త‌తో అస్సాంలో భూకంపం..!

అస్సాంలోని మోరిగావ్ జిల్లాలో సోమవారం ఉదయం రిక్టర్ స్కేలుపై 5.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ సమాచారాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) అందించింది. ఉదయం 04:17:40 గంటలకు భూకంపం సంభవించింది. భూకంప‌ కేంద్రం 26.37 N అక్షాంశం, 92.29 E రేఖాంశం 50 కిమీ లోతులో ఉంది. అస్సాంలోని అనేక జిల్లాలు, మేఘాలయలోని షిల్లాంగ్‌లో కూడా భూకంపం సంభవించింది. బ్రహ్మపుత్ర నది దక్షిణ ఒడ్డున మోరిగావ్ జిల్లాలో భూకంపం నమోదైంది.

మధ్య అస్సాంలోని కొన్ని ప్రాంతాలలో నివసించే ప్రజలు తేలికపాటి నుండి మితమైన ప్రకంపనలు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టంపై ఎటువంటి నివేదికలు అంద‌లేద‌ని అధికారులు తెలిపారు. పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

భూకంపం కార‌ణంగా కమ్రూప్ మెట్రోపాలిటన్, నాగావ్, తూర్పు మరియు పశ్చిమ కర్బీ ఆంగ్లాంగ్, హోజాయ్, దిమా హసావో, గోలాఘాట్, జోర్హాట్, శివసాగర్, చరైడియో, కాచర్, కరీంగంజ్, హైలకండి, ధుబ్రి, సౌత్ సల్మారా మంకాచార్, గోల్‌పరా నివాసితులు షాక్‌కు గురయ్యారు. ఇవే కాకుండా.. దర్రాంగ్, తముల్‌పూర్, సోనిత్‌పూర్, కమ్రూప్, బిస్వనాథ్, ఉదల్‌గురి, నల్బరి, బజలి, బార్‌పేట, బక్సా, చిరాంగ్, కోక్రాజార్, బొంగైగావ్ మరియు లఖింపూర్‌తో సహా అనేక ఉత్తరాది జిల్లాల్లో కూడా భూకంపం సంభవించింది.

Next Story