జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడి.. గ్రనేడ్లు విసిరి.. ఆపై కాల్పులు

4 including 2 civilians, 2 cops killed in Sopore militant attack. జమ్ము కశ్మీర్‌లో మరోమారు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లా

By Medi Samrat
Published on : 12 Jun 2021 3:50 PM IST

జమ్ముకశ్మీర్ లో ఉగ్రదాడి.. గ్రనేడ్లు విసిరి.. ఆపై కాల్పులు

జమ్ము కశ్మీర్‌లో మరోమారు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలోని సోపోర్ పట్టణంలో సీఆర్పీఎఫ్, పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులు జ‌రిపారు. మొదట గ్రనేడ్లు విసిరిన ఉగ్ర‌వాదులు.. ఆపై కాల్పులు జరిపారు. సీఆర్పీఎఫ్, కశ్మీర్ పోలీసుల బృందంపై ఈ దాడి జ‌రిగింది. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు, ఇద్దరు పౌరులు మృతి చెందారు. ఈ ఘ‌ట‌న‌లో ఓ పోలీసు సహా ముగ్గురు పౌరులు గాయపడ్డారు.

క్షతగాత్రులను సైనిక ఆసుపత్రికి తరలించారు అధికారులు. కాగా, దాడి సమాచారం తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు అదనపు బలగాలను సంఘటనా స్థలానికి తరలించారు. అక్కడి మెయిన్ చౌక్ ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చేపట్టాయి. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు మాట్లాడుతూ.. లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ఈ దాడికి పాల్పడినట్టు తెలిపారు.


Next Story