న్యూస్‌మీటర్ టాప్ 10 న్యూస్
By సుభాష్ Published on 7 Sep 2020 9:48 AM GMT1.ఆత్మహత్యల్లో పేదలు, చదువుకున్న వారే అధికం.. ఆత్మహత్యల్లో 2019 కొత్త రికార్డు
దేశంలో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. పెళ్లి కావడం లేదనో.. ఉద్యోగాలు లభించడం లేదనో, ఆర్థిక ఇబ్బందుల కారణంగానో ఇలా ఎన్నో కారణాల వల్ల ఆత్మహత్యలకు పాల్పడుతూ తమ విలువైన జీవితాన్ని పోగొట్టుకుంటున్నారు. ఆత్మహత్యల్లో పేదలు, చదువుకున్నవారు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దేశంలో ఆత్మహత్యలపై ఎన్నో అవగాహన కల్పించినా.. గత 11 ఏళ్లలో కంటే 2019 సంవత్సరంలో అత్యధికంగా ఆత్మహత్యలు నమోదు కావడం గమనార్హం.. పూర్తివార్త కోసం క్లిక్ చేయండి
2. ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో సర్వీసులు.. వారికి అనుమతి లేదు
కరోనా మహమ్మారి కారణంగా దాదాపు ఐదు నెలల తర్వాత హైదరాబాద్ మెట్రో సర్వీసు సేవలు ప్రారంభమయ్యాయి. కరోనా నేపథ్యంలో మూడు దశల్లో మెట్రోను ప్రారంభించనున్నారు. మొదటి దశ సోమవారం నుంచి ప్రారంభమైన మెట్రో.. మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నడవనున్నాయి. దీనికి సంబంధించి మెట్రో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే మెట్రోలో ప్రయాణించే వారిపై ప్రత్యేక నిఘా పెంచనున్నారు. మాస్క్ లేకపోయినా.. టెంపరేచర్ ఎక్కువగా ఉన్నా.. మెట్రోలో అనుమతించరు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. బిగ్‌బాస్-4: హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన 16 మంది కంటెస్టెంట్లు వీరే
బిగ్‌బాస్-4 ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రారంభమైన విషయం తెలిసిందే. బిగ్‌బాస్ హోస్టుగా మారోసారి నాగార్జున తండ్రి పాత్రలో సరికొత్తగా కనిపించారు. ఇక బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ఎవరనేది షో ప్రారంభం అయ్యే వరకు ప్రేక్షకుల్లో కొంత ఉత్కంఠ ఉండేది. నిన్న షో ప్రారంభంతో తెరపడింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. భాగ్యనగరంలో అరుదైన ఘటన.. ఏడేళ్ల కిందట దాచుకున్న వీర్యంతో సంతాన భాగ్యం
కొంత మందికి పిల్లలు లేక మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. పెళ్లై ఏళ్లు దాటుతున్నా.. సంతానం కలగక మానసికంగా కుంగిపోతుంటారు. తిరగని ఆస్పత్రులు ఉండవు. అలాంటిది హైదరాబాద్‌లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఏడు సంవత్సరాల కిందట ఓ జంట దాచుకున్నవీర్యం ఇప్పుడు వారికి సంతాన భాగ్యం కలిగింది. ఆ సమయంలోనే ముందు జాగ్రత్తతో వీర్యాన్ని భద్రపర్చుకోగా, తాజాగా ఆ జంటకు పండంటి బిడ్డ జన్మించింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ‘లవకుశ’ నాగరాజు కన్నుమూత
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. ‘లవకుశ’ నాగరాజు (72) కన్నుమూశారు. లవకుశ సినిమా సీత రాములను కళ్లకు కట్టినట్లు ఈ సినిమా ఇప్పటికి చెక్కుచెదరనిది. అందులో లవ, కుశలుగా నటించిన ఇద్దరు పిల్లలు సినిమాకే హైలెట్‌గా నిలిచారు. వారి హావ భావాలు ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేశారు. ఈ సినిమా విడుదలై ఏళ్లు గడుస్తున్నా.. ఆ ఇద్దరు పిల్లలు ఇంకా కళ్లముందు కదలాడుతూనే ఉంటారు. వారు పెరిగి పెద్దవారైనప్పటికీ లవ, కుశలుగానే అందరి చేత మంచి గుర్తింపు పొందారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. ఐపీఎల్ 2020 : అబుదాబీ షేక్ జాయేద్ స్టేడియం గురించి తెలుసుకుందామా..?
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్-2020 షెడ్యూల్ వచ్చేసింది. కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ భారత్ లో కాకుండా యుఏఈలో నిర్వహించనున్నారు. అందులో భాగంగా మూడు స్టేడియంలు ఈ బడా ఈవెంట్ కు ఆథిత్యం ఇవ్వనున్నాయి. ఆ మూడు స్టేడియంలలో అబుదాబీ లోని ‘షేక్ జాయేద్ స్టేడియం’ ఒకటి.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. వీఆర్వో వ్యవస్థ రద్దు..!
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త రెవెన్యూ చట్టం తయారైంది. ల్యాండ్ మేనేజ్‌మెంట్ అడ్మినిస్టేషన్ యాక్ట్ గా చట్టాన్నిఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీని వల్ల వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి మరో ముందుడు వేయనుంది. కాగా, వీఆర్వోల నుంచి రెవెన్యూ రికార్డులు ఈ సాయంత్రం 3 గంటల్లోగా స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అలాగే ఈ రోజే సాయంత్రం 5 గంటల్లోగా రిపోర్టులు పంపాలని ఆదేశించింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. విజయ్ దేవరకొండ హీరోయిన్ సినిమా కూడా ఓటీటీనే నమ్ముకుంది
విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘ఫైటర్’. బాలీవుడ్ నటి అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం నెపోటిజంకు వ్యతిరేకంగా బాలీవుడ్ లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఆలియా భట్ నటించిన ‘సడక్ 2’ సినిమాకు పెద్ద ఎత్తున డిస్ లైక్స్ వచ్చాయి. ఆ తర్వాత మరో నటి అయిన అనన్య పాండే నటించిన ‘ఖాలీ-పీలీ’ సినిమాకు కూడా అదే స్థాయిలో వ్యతిరేకత వచ్చింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఇంట్లో పేలిన బాంబు.. ఇద్దరి మృతి
పశ్చిమ బెంగాల్‌లోని ఓ ఇంట్లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు కామర్హటి గోలాఘాట్ ప్రాంతంలోని ఓ ఇంట్లో నాటు బాంబు పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులని షేక్ రాజు (35), మహ్మద్ సాహిద్ గా గుర్తించారు.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. 9,10, ఇంటర్ విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లవచ్చు.. ఏపీ అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలు
దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉండగా, కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ ప్రక్రియ కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 1 నుంచి అన్‌లాక్ 4.0కు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈనెల 30 వరకు విద్యా సంస్థలన్నీ మూసే ఉంటాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. కంటైన్‌మెంట్ జోన్లలో మినహా ఇతర ప్రాంతాల్లో 9,10 తరగతి విద్యార్థులు, ఇంటర్ కళాశాలలకు చెందిన విద్యార్థులు విద్యా సంస్థలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది.. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి