విజయ్ దేవరకొండ హీరోయిన్ సినిమా కూడా ఓటీటీనే నమ్ముకుంది

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  7 Sep 2020 6:55 AM GMT
విజయ్ దేవరకొండ హీరోయిన్ సినిమా కూడా ఓటీటీనే నమ్ముకుంది

విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 'ఫైటర్'. బాలీవుడ్ నటి అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం నెపోటిజంకు వ్యతిరేకంగా బాలీవుడ్ లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే ఆలియా భట్ నటించిన 'సడక్ 2' సినిమాకు పెద్ద ఎత్తున డిస్ లైక్స్ వచ్చాయి. ఆ తర్వాత మరో నటి అయిన అనన్య పాండే నటించిన 'ఖాలీ-పీలీ' సినిమాకు కూడా అదే స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పటికే చాలా సినిమాలు థియేటర్లలో విడుదలకు నోచుకోవడం లేదు. ఈ సినిమా కూడా ఇక ఓటీటీలోనే విడుదల కానుంది.

ఖాలీ-పీలీ సినిమాలో ఇషాన్ ఖట్టర్ హీరోగా నటించాడు. ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించింది. అక్టోబర్ 2వ తేదీన 'జీ ప్లెక్స్' లో ఈ సినిమా విడుదల కాబోతోంది. జీ ప్లెక్స్ ఛానల్ పలు డిష్ నెట్వర్క్ లలో లభిస్తూ ఉంది. ఆ తర్వాత జీ5 యాప్ లో సినిమా లభించవచ్చు.

ఇటీవలే సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేశారు. ట్యాక్సీ డ్రైవర్ బ్లాకీ (ఇషాన్ ఖట్టర్), డ్యాన్సర్ (అనన్య పాండే) లు కలిసి డబ్బులు, బంగారం తీసుకుని పారిపోయే జర్నీని ఇందులో చూపించారు. అడ్వెంచరస్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు. మక్బూల్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. భరత్ సినిమా దర్శకుడు అలీ అబ్బాస్ జఫర్, జీ స్టూడియోస్, హిమాంషు మెహ్రా లు నిర్మించారు. గులాబో సితాబో ఆయుష్మాన్ ఖురానా, అమితాబ్ బచ్చన్ కలిసి నటించిన సినిమా ఓటీటీలో డైరెక్ట్ గా విడుదలయింది.

డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన బాలీవుడ్ కు చెందిన బడా ప్రాజెక్ట్ ఇదే..! ఆ తర్వాత సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన ఆఖరి సినిమా దిల్ బేచారా, విద్యా బాలన్ నటించిన శకుంతలా దేవి, జాన్వీ కపూర్ నటించిన గుంజన్ సక్సేనా, ఆలియా భట్ నటించిన సడక్-2 సినిమాలతో పాటూ మరికొన్ని సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్ లలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ఖాలీ-పీలీ కూడా ఓటీటీనే నమ్ముకుంది.

Next Story