దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌

By సుభాష్  Published on  13 July 2020 4:19 AM GMT
దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాప్తి మరింత వేగం అవుతోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు.

ఇక దేశంలో కరోనా మహమ్మారి తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలు కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లను ప్రకటిస్తున్నాయి. ఈ పాటికే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో 55 గంటల పాటు వారం రోజులపాటు లాక్‌డౌన్‌ అమలు చేసింది. అలాగే అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయా, బీహార్‌ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ విధించాలని నిర్ణయం తీసుకున్నాయి. కరోనా కట్టడికి వేరే మార్గం లేకపోవడంతో ఈ దిశగా మళ్లీ అడుగులు వేస్తున్నాయి. అలాగే పుణెతో పాటు పింప్రి చించ్వాడ్‌ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించింది మహారాష్ట్ర సర్కార్‌. ముంబైలోనూ కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఇక కర్ణాటకలో జూలై 14 వరకు వారం రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించింది అక్కడి ప్రభుత్వం. తమిళనాడులోని మధురై సహా అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ తరహాలోనే కఠినంగా అమలు చేస్తోంది.

ఇక బీహార్‌లోని పట్నా, భగల్‌పూర్‌, నలందా, బెగూసరాయ్‌, నవాడ, వెస్ట్‌ చంపారన్‌ జిల్లాల్ల్ఓ 24 గంటలపాటు లాక్‌డౌన్‌ ఆక్షలు విధించింది అక్కడ ప్రభుత్వం. అలాగే జమ్మూకశ్మీర్‌లో ఆదివారం నుంచి లాక్‌డౌన్‌ అమవు చేసింది ప్రభుత్వం. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌ తో పాటు 67 కంటైన్‌మెంట్‌ జోన్‌ ప్రాంతాలను సైతం పూర్తిగా మూసివేశారు. ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది.

ఇలా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ కొరలు చాస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో లాక్‌డౌన్ అమలు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఎందుకంటే కరోనాకు మందులేని కారణంగా ఎవరికి వారే జాగ్రత్తలు పాటిస్తే తప్ప వేరే మార్గం లేదు. కానీ కొందరి నిర్లక్ష్యం కారణంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా జాగ్రత్తలు ఎన్నిసార్లు చెప్పినా కొందరు పెడచెవిన పెడుతున్నారు. కొందరైతే కనీసం మాస్క్‌ లు కూడా ధరించకుండా రోడ్లపై తిరుగుతున్నాయి. అంతేకాదు భౌతిక దూరం కూడా పాటించడం లేదు. మార్కెట్లు, దుకాణ సముదాయాల్లో, ఇతర ప్రాంతాల్లో ఎలాంటి భయం లేకుండా భారీగా గుమిగూడుతున్నారు. పోలీసులు కూడా మాస్క్‌ లు ధరించనివారిపై అవనసరంగా రోడ్లపైకి వచ్చినవారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. అయితే ఇంతైనా సోకి లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక చేసేదేమి లేక లాక్‌డౌన్ అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Next Story
Share it