రైతులకు కేంద్రం మరో గుడ్‌న్యూస్‌

By సుభాష్  Published on  13 July 2020 2:05 AM GMT
రైతులకు కేంద్రం మరో గుడ్‌న్యూస్‌

రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని నరేంద్రమోదీ పలు పథకాలను ప్రవేశపెడుతూ ముందుకు సాగుతోంది. బడుగు, బలహీన వర్గాలకు ఎన్నోపథకాలను తీసుకువస్తోంది. అలాగే రైతులకు కూడా పలు పథకాలను అందిస్తోంది. రైతులకు సాయం చేసేందుకు కేంద్రం తీసుకొచ్చిన కిసాన్‌ క్రెడిట్‌ పథకంలో అతి తక్కువ అంటే సుమారు 4శాతం వడ్డీకే రుణం లభిస్తోంది. నిజానికి 7శాతం వడ్డీ వసూలు చేస్తున్నా.. సకాలంలో సక్రమంగా చెల్లిస్తే 3శాతం వడ్డీ మినహాయింపు పొందుతారు. సొంత భూమి ఉన్న రైతులు, ఉమ్మడి సాగుదారులు, కౌలు రైతులతో పాటు స్వయం సహాయక బృందాలు కూడా ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందే అవకాశం ఉంది. ఈ పథకాన్ని పొందాలంటే దరఖాస్తుతోపాటు గుర్తింపు ధృవీకరణ పత్రాలు ఇచ్చి రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ పథకాన్ని రైతుల కోసం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడంతో రైతులకు ఎంతో మేలు చేకూరనుంది. అంతేకాదు రైతులు వ్యవసాయంలో ఖర్చుల భారం తగ్గించుకోవచ్చు. అధిక వడ్డీ రేట్లకు రుణాలు ఇచ్చే ఫైనాన్స్‌ కంపెనీల బారిన రైతులు చిక్కుకోకుండా నిరోధించవచ్చు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే.. ఏదైనా ఓటరు ఐడి కార్డు లేదా పాన్‌ కార్డు, పాస్‌పోర్టు, ఆధార్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ అవసరమై ఉంటుంది.

Next Story
Share it