మేము కూడా అదే సుంకం విధిస్తాం.. భారత్‌కు ట్రంప్ బెదిరింపు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై తన వైఖరిని స్పష్టం చేశారు. భారత్‌పై పరస్పర పన్ను విధిస్తానని ట్రంప్ బెదిరించారు.
By Medi Samrat Published on 18 Dec 2024 9:45 AM ISTఅమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై తన వైఖరిని స్పష్టం చేశారు. భారత్‌పై పరస్పర పన్ను విధిస్తానని ట్రంప్ బెదిరించారు. అమెరికా వస్తువులపై భారత్ ఎలాంటి పన్ను విధిస్తుందో అదే పన్నును భారతీయ వస్తువులపై అమెరికా విధిస్తుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
మార్-ఎ-లాగోలో విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ ప్రకటన చేశారు. మాపై పన్ను వేస్తే మేం వారికీ సమానంగా పన్ను విధిస్తామని చెప్పారు. వారు మాకు పన్ను విధించారు. దాదాపు అన్ని సందర్భాల్లో వారు మాకు పన్ను విధిస్తున్నారు.. మేము వారిపై పన్ను విధించడం లేదన్నారు.
భారతదేశం మాపై 100 శాతం సుంకం వసూలు చేస్తే.. మేము వారి నుండి ఏమీ వసూలు చేయలేమా..? మీకు తెలుసా.. వారు మాకు సైకిల్ పంపుతారు.. మేము వారికి సైకిల్ పంపుతామన్నారు. భారతదేశం చాలా ఎక్కువ ఫీజులు వసూలు చేస్తుంది. వారు మా దగ్గర వసూలు చేయాలనుకుంటే, ఫర్వాలేదు, కానీ మేము వారి నుంచి అదే వసూలు చేస్తామని హెచ్చరించారు.
అంతకుముందు ట్రంప్ కెనడాను USలోకి డ్రగ్స్, అక్రమ వలసదారుల ప్రవాహాన్ని ఆపడంలో విఫలమైతే తన పరిపాలన మొదటి రోజు నుండి 25% సుంకాలను విధిస్తానని హెచ్చరించాడు.
ట్రంప్, డెట్రాయిట్ ఎకనామిక్ క్లబ్ సభ్యులతో మాట్లాడుతూ.. హార్లీ డేవిడ్‌సన్ బైక్‌లపై దిగుమతి పన్నుల ఉదాహరణను ఉటంకిస్తూ.. సుంకాలలో భారతదేశం "అతిపెద్ద ఛార్జర్" అని ఆరోపించారు. గతంలో చైనా నుండి దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలను పెంచుతామని ట్రంప్ బెదిరించారు.
ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్‌కీతో మాట్లాడతానని ట్రంప్ చెప్పారు. ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని తన రిసార్ట్‌లో విలేకరుల సమావేశంలో ట్రంప్ ఈ విషయం చెప్పారు. గాజాలో యుద్ధాన్ని ముగించేందుకు జనవరి 20 నాటికి మొత్తం 100 మంది ఇజ్రాయెల్‌లను, ఇతర దేశాల నుండి బందీలుగా ఉన్నవారిని విడుదల చేయాలని ట్రంప్ మరోసారి హమాస్‌ను కోరారు.