ఉక్రెయిన్ కు వెళ్లనున్న ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది

By Medi Samrat  Published on  19 Aug 2024 1:55 PM GMT
ఉక్రెయిన్ కు వెళ్లనున్న ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్‌లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యాతో వివాదం తర్వాత యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్ పర్యటనకు మోదీ వెళ్లడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మాస్కోలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసిన ఒక నెల తర్వాత ఆయన ఉక్రెయిన్ పర్యటనకు వెళ్లనున్నారు. పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలను పంచుకుంటామని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెలలో మోదీ కైవ్‌లో పర్యటించే అవకాశం ఉందని భారత మీడియా కూడా తెలిపింది.

2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసిన తరువాత పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించారు. అయితే భారతదేశం, చైనా వంటి దేశాలు రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగించాయి. రష్యాతో భారతదేశ సంబంధాలపై US ఆందోళనలను లేవనెత్తింది. పాత మిత్రుడైన రష్యాతో సంబంధాలను చెక్కుచెదరకుండా ఉంచుతూనే, పాశ్చాత్య దేశాలతో తన సంబంధాన్ని మరింతగా పెంచుకోవాలని భారత్ ప్రయత్నించింది.

Next Story