భారీగా పడిపోయిన బంగారం ధర
By సుభాష్ Published on 21 March 2020 10:58 AM ISTబంగారం కొనేవారికి ఇది శుభవార్తే. నిన్న రెక్కలొచ్చిన బంగారానికి ఈ రోజు భారీగా దిగివచ్చింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గుముఖం పట్టడం, దేశీ మార్కెట్‌లో జువెల్లర్స్, కొనుగోలు దారుల నుంచి డిమాండ్ తగ్గిపోవడంతో పసిడి ధర తగ్గిందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం బంగారంధర భారీగా దిగొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.1,050 తగ్గి రూ. 41,920కి పడిపోయింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,050 తగ్గుతూ రూ.38,340కి చేరుకుంది.
అలాగే బంగారం బాటలో వెండి కూడా పయనిస్తోంది. కిలో బంగారం ధర ఏకంగా రూ.1,790 తగ్గుతూ ప్రస్తుతం రూ. 39,990కి పడిపోయింది.
కాగా, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర తగ్గింది. 1500 డాలర్ల దిగువన పయనిస్తోంది. బంగారం ధర ఔన్స్ కు 0.36 శాతం తగ్గుదలతో 1472.90 డాలర్లకు క్షీణించింది. ఇక బంగారం తగ్గితే వెండి ధర మాత్రం వేరే దారిలో వెళ్తోంది. వెండి ధర ఔన్స్ కు 3.21శాతం పెరుగుదలతో 12.15 డాలర్లకు ఎగిసింది.
ఇక దేశ రాజధాని అయిన ఢిల్లీలో సైతం మార్కెట్‌లో కూడా బంగారం ధర వెలవెలబోతోంది. ఏకంగా రూ.1,100 పడిపోయింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1100 తగ్గుతూ రూ. 40,350కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1100 తగ్గి రూ.39,150కు పడిపోయింది.