కరోనా ఎఫెక్ట్‌ తో ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. ఎక్కడ చూసిన కరోనా భయం పట్టుకుంది. కరోనా వైరస్‌ కారణంగా మరణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఒకవైపు పలు సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచే వర్క్‌ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కొందరికి ఇంట్లో నెట్‌ సౌకర్యం లేని కారణంగా ఇప్పటికే రిలయన్స్‌ జియో వినియోగదారుల కోసం ఆఫర్ ప్రకటించింది. ఇక తాజాగా బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా వినియోగదారుల కోసం ఓ ఆఫర్‌ తీసుకొచ్చింది. కరోనా భయంతో ఇప్పటికే చాలా మంది ఇంటి నుంచే పని చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాంటి వారి కోసం బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ ను బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో ల్యాండ్‌లైన్‌ ఉన్న వారికి ఉచితంగా నెల రోజుల పాటు ఈ సేవలను అందుబాటులో ఉంచనుంది.

వ్యవధి ముగిసిన తర్వాత, పై ప్లాన్‌ కింద ఉన్న వినియోగదారులు ప్రస్తుతం ప్రవేశపెట్టిన ప్లాన్‌లోకి మారిపోతారని బీఎస్‌ఎస్‌ఎన్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ప్లాన్‌ ద్వారా 10 ఎంబీపీఎస్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ను, రోజుకు 5జీబీ డేటాను వినియోగదారులకు ఉచితంగా అందించనుంది. ఒక వేళ డేటా పరిమితి అయిపోతే, డేలా వేగం 1ఎంబీపీఎస్‌కు పరిమితం అవుతుందని తెలిపింది. కొత్త ఆఫర్‌ ద్వారా ఇంటి నుంచి పని చేయడానికి, ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా విద్యాభ్యాసం చేయడానికి ఉపయోగించుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్‌ బోర్డు డైరెక్టర్‌ సీఎఫ్‌ఎ వివేక్‌ బంజాల్‌ తెలిపారు. అలాగే ల్యాండ్‌లైన్‌ వినియోగదారులను బ్రాడ్‌బ్యాండ్‌ వినియోగదారులుగా మార్చడంలో ఈ కొత్త ప్లాన్‌ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.