కరోనా ఎఫెక్ట్‌: జియో బంపర్‌ ఆఫర్‌..!

By సుభాష్  Published on  21 March 2020 3:47 AM GMT
కరోనా ఎఫెక్ట్‌: జియో బంపర్‌ ఆఫర్‌..!

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఎక్కడ చూసినా కరోనా విజృంభిస్తోంది. ఈ వైరస్‌ అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. స్టాక్‌ మార్కెట్లు సైతం పతనమైపోతున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు షట్ డౌన్‌ కాగా, ఆ బాటలోనే మరిన్ని రాష్ట్రాలు చేరుతున్నాయి. కరోనా వైరస్‌ కారణంగా ఇప్పటికే విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్‌, ఇతర రంగాలన్నీ మూతపడ్డాయి. ఇక దేశ వ్యాప్తంగా కొన్ని కంపెనీలు ఉద్యోగులు వర్క్‌ ఫ్రం హోం చేయాలంటూ ఆదేశించాయి. దీనికి తోడు కొద్ది రోజులుగా భారత్‌ అంతటా ఇంటర్నెట్‌ సేవలు కూడా ఎక్కువయ్యాయి.

ఈ నేపథ్యంలో టెలికాం దిగ్గజం జియో వినియోగదారులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఇంటి నుంచి పని చేసే వారికి అదనపు ప్రయోజనాలు కల్పిస్తూ నూతన 4జీ డేటా ఓచర్లను ప్రకటించింది. 4జీ సౌకర్యంతోపాటు టాక్‌టైమ్‌ను రూ. 11 నుంచి రూ.101 ప్లాన్స్‌ వరకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒకవేళ డేటా ముగిసిన తర్వాత 64 కేబీపీస్‌తో అపరిమితంగా ఇంటర్‌నెట్‌ సేవలు ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

Advertisement

జియో ప్రకటించిన ప్లాన్స్‌ ఇలా ఉన్నాయి

రూ.11800 ఎంబీడేటా200 నిమిషాల టాక్‌టైమ్‌
రూ.212 జీబీ డేటా200 నిమిషాల టాక్‌టైమ్‌
రూ.516 జీబీ డేటా500 నిమిషాల టాక్‌టైమ్‌
రూ.10112 జీబీ డేటానిమిషాల టాక్‌టైమ్‌

కాగా, రూ. 251 ఓచర్‌కు మాత్రం అదే పాత ఆఫర్‌ వర్తిస్తుందని పేర్కొంది.

Next Story
Share it