కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక ప్రకటన

By సుభాష్  Published on  12 May 2020 11:14 AM GMT
కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక ప్రకటన

దేశంలో కరోనా వైరస్‌ అధికంగా ఉండటంతో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఓ కీలక ప్రకటన చేశారు. రెండు, మూడు రోజుల్లో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణలోని పారిశ్రామికవేత్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గడ్కరీ మాట్లాడారు. రుణాల రీపేమెంట్‌ విషయంలో ఆర్‌బీఐ మూడు నెలల మారటోరియం విధించినా, దేశ వ్యాప్తంగా పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. దీనికి సంబంధించిన అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామన్నారు.

దేశంలో అన్ని పరిశ్రమలను ఆదుకునేందుకు కృషి

కరోనా సంక్షోభం నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని పరిశ్రమలను ఆదుకునేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. కరోనా వచ్చాక ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, దీనిని ఎలా గాడిలో పెట్టాలో ఆలోచిస్తున్నామని అన్నారు. పరిశ్రమలను ఆదుకునే విషయంలో ప్రభుత్వ పరిమితులను కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరిశ్రమల ఇబ్బందులను గుర్తించుకునే అమెరికా, జపాన్‌ వంటి దేశాలు భారీ ప్యాకేజీలను ప్రకటించాయని గుర్తు చేశారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమతో పాటు పారిశ్రామిక వేత్తల సీఈఓలతో ప్రధాని మోదీ, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ త్వరలో భేటీ కానున్నట్లు తెలిపారు.

Next Story