పట్టాలెక్కిన రైళ్లు.. ఎక్కడెక్కడ నడుస్తాయంటే..

By సుభాష్  Published on  12 May 2020 6:29 AM GMT
పట్టాలెక్కిన రైళ్లు.. ఎక్కడెక్కడ నడుస్తాయంటే..

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుండగా, కరోనా కట్టడికి ఈనెల 17వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ కొనసాగనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 12వ తేదీ (నేటి నుంచి) రైళ్లను నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసంది. ప్రయాణికుల కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచి దేశంలోని 15 గమ్యస్థానాలకు మొత్తం 30 రైళ్లను నడపనున్నట్లు స్పష్టం చేసింది. ఈ రోజు రైల్వే అధికారులు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

వీటిని స్పెషల్‌ ట్రైన్లుగా పిలవనున్నారు. ఢిల్లీ నుంచి సికింద్రాబాద్‌, దిబ్రూగఢ్‌, అగర్తలా, పాట్నా, హౌరా, బిలాస్‌పూర్‌, రాంచీ, భువనేశ్వర్‌, బెంగళూరు, చెన్నై, తిరునంతపురం, మడ్‌గావ్‌, ముంబైల్‌ సెంట్రల్‌, అహ్మదాబాద్‌, జమ్మూతావి రైల్వే స్టేషన్లకు ఈ రైళ్లను నడపనుంది. కాగా, నెల 11వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి ఐఆర్‌సీటీసీలో టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని రైల్వేశాఖ తెలిపిన విషయం తెలిసిందే.

కాగా, ఇప్పటికే కేంద్రం పలు రంగాల్లో లాక్‌డౌన్‌ నుంచి సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోంది.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

►టికెట్‌ కన్ఫామ్‌ అయిన వాళ్లు మాత్రమే రైల్వేస్టేషన్‌కు రావాలి

►రైలు ప్రయాణం చేసే వారు గంట ముందే స్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది

► ప్రయాణికులకు స్క్రినింగ్‌ చేస్తారు. అందులో నెగిటివ్‌ అని తేలితేనే రైలు ప్రయాణం

► రైల్వే స్టేషన్‌, బోగీలో శానిటైజర్లు ప్రొడైడ్‌ చేస్తారు

► తక్కువ లగేజీని మాత్రమే అనుమతి

► మాస్కులు ధరించడం, సోషల్‌ డిస్టెన్స్‌ తప్పని సరి

Next Story