సీనియర్​ నటి కవిత ఇంట మ‌రో విషాదం

Veteran actress Kavitha's husband passes away. అల‌నాటి హీరోయిన్‌, టాలీవుడ్​ సీనియర్​ నటి కవిత ఇంట మ‌రో విషాదం చోటుచేసుకుంది. రెండు వారాల క్రితం

By Medi Samrat
Published on : 30 Jun 2021 4:05 PM IST

సీనియర్​ నటి కవిత ఇంట మ‌రో విషాదం

అల‌నాటి హీరోయిన్‌, టాలీవుడ్​ సీనియర్​ నటి కవిత ఇంట మ‌రో విషాదం చోటుచేసుకుంది. రెండు వారాల క్రితం క‌విత‌ కుమారుడు సంజయ్​ కరోనాతో మరణించగా.. బుధవారం నాడు ఆమె భర్త దశరథ రాజ్ కూడా క‌రోనాతో పోరాడుతూ​ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం కొవిడ్ బారిన పడిన దశరథ రాజ్ ఆరోగ్యం.. ఇటీవల విషమించింది. దీంతో కుటుంబ స‌భ్యులు చెన్నైలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చేర్చారు.

చికిత్స పొందుతూ దశరథ రాజ్ తుదిశ్వాస విడిచారు. క‌విత‌ భర్త మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. 11 ఏళ్ల ప్రాయంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన క‌విత‌.. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం కొన్ని సీరియల్స్​లోనూ నటిస్తూ బిజీగా ఉన్న క‌విత‌.. రాజ‌కీయాల్లోనూ రాణించారు. ప్ర‌స్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు.


Next Story