విషాదంలో 'పుష్ప' చిత్ర యూనిట్‌.. స్టిల్ ఫొటోగ్రాఫర్ హఠాన్మరణం!

Tollywood Still Photographer Srinivas Passed Away. ప్రముఖ సినీ ఫొటోగ్రాఫర్ జీ. శ్రీనివాస్‌ కన్నుమూశారు. 200కు పైగా

By Medi Samrat  Published on  29 Jan 2021 3:39 AM GMT
విషాదంలో పుష్ప చిత్ర యూనిట్‌.. స్టిల్ ఫొటోగ్రాఫర్ హఠాన్మరణం!

ప్రముఖ సినీ ఫొటోగ్రాఫర్ జీ. శ్రీనివాస్‌ కన్నుమూశారు. 200కు పైగా సినిమాల‌కు స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌గా పని చేసిన ఆయ‌న.. గుండెపోటుతో మృతి చెందారు. శ్రీనివాస్ ప్ర‌స్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న 'పుష్ప' సినిమాకు ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు. సినిమా చిత్రీకరణలో భాగంగానే తూర్పుగోదావరి వెళ్లారు.


అయితే.. మారేడుమిల్లి నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా శ్రీనివాస్‌కు గుండెపోటు రావడంతో ఆసుప‌త్రికి త‌ర‌లిస్తుండ‌గా మార్గ‌మ‌ధ్యంలో మ‌ర‌ణించారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌స్సు 54 సంవ‌త్స‌రాలు. షూటింగ్ నిమిత్తం వెళ్లి శ్రీనివాస్‌ గుండెపోటుతో మృతి చెందడంతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. శ్రీనివాస్‌ తెలుగు సినీ స్టిల్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా కూడా పని చేశారు. ఆయనకు భార్య ఇద్దరు కుమార్తులున్నారు. శ్రీనివాస్‌ మృతికి పుష్ప చిత్ర‌యూనిట్‌తో పాటు టాలీవుడ్ ప్ర‌ముఖులు సంతాపం తెలిపారు.


Next Story