డబ్బు సంపాదనే లక్ష్యంగా జరుగుతున్న మోసాలకు అడ్డూ.. అదుపూ లేకుండా పోతుంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. తాజాగా టాలీవుడ్ నిర్మాత, రామానాయుడు తనయుడు సురేష్ బాబుకు పెద్దమొత్తంలో కరోనా వ్యాక్సిన్స్ ఇస్తానంటూ ఓ వ్యక్తి మోసం చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. సెలబ్రిటీలకే ఇలా జరిగితే సామాన్యుల పరిస్థితేంటని మాట్లాడుకుంటున్నారు.
వివరాళ్లోకెళితే.. నాగార్జున రెడ్డి ఓ వ్యక్తి తన దగ్గర 500 కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్ బాబు ఆఫీస్‌కు ఫోన్ చేశాడు. డబ్బును తన భార్య బ్యాంక్ అకౌంటుకు ట్రాన్స్‌ఫర్ చేయాలని కోరాడు. దీంతో ఆ మాటలు నమ్మి సురేష్ బాబు మేనేజర్ లక్ష రూపాయలు ట్రాన్సఫర్ చేశాడు. డబ్బులు ట్రాన్సఫర్ చేశాక నాగార్జున రెడ్డికి ఫోన్ చేయడంతో అతని ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో అతనిపై అనుమానం రావడంతో సురేష్ బాబు మేనేజర్ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగార్జున రెడ్డిని అరెస్ట్ చేశారు.