కాఫీ టైమ్ లో 'పవన్ కళ్యాణ్' ను తగులుకున్న వర్మ
Ram Gopal Varma Tweets On Pawan Kalyan. రామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఎవరిని తగులుకుంటాడో అసలు ఊహించలేము..!
By Medi Samrat Published on 31 Jan 2022 11:34 AM ISTరామ్ గోపాల్ వర్మ.. ఎప్పుడు ఎవరిని తగులుకుంటాడో అసలు ఊహించలేము..! ఒక్కోసారి సదరు హీరోకు ఫ్యాన్ అని చెబుతాడు.. ఇంకోసారి కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తాడు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలను పాన్ ఇండియా సినిమాలు చేయాలని వర్మ అంటున్నాడు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆయన సినిమాలను హిందీలో పాన్ ఇండియా రేంజిలో విడుదల చేయాలని ఆర్జీవీ బలంగా కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఉదయం వరుసగా ట్వీట్లు పవన్ కళ్యాణ్ మీద వేసుకుంటూ వచ్చాడు.
. @pawankalyan గారూ ,ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్‌ని హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్రిట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు...ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి..పవర్ ప్రూవ్ చెయ్యండి.
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
"పవన్ కళ్యాణ్ గారూ ఆ రోజు సర్దార్ గబ్బర్ సింగ్ ను హిందీలో రిలీజ్ చెయ్యొద్దు వర్కవుట్ అవ్వదు, అని ఈ ట్రిట్టర్ సాక్షిగా ఎంత మొత్తుకున్నా మీరు వినలేదు.. ఫలితం చూసారు.. ఇప్పుడు మళ్లీ చెప్తున్నా .. భీమ్లా నాయక్ ఏ మాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రిలీజ్ చెయ్యండి.. పవర్ ప్రూవ్ చెయ్యండి" అని చెప్పుకొచ్చాడు వర్మ.
పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ @PawanKalyan అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
"పుష్ప యే అంత చేస్తే పవర్ స్టార్ @PawanKalyan అయిన మీరు నటించిన భీమ్లా నాయక్ ఇంకా ఎంత కలెక్ట్ చెయ్యాలి? ..పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము" అని ఫ్యాన్స్ ను కూడా గెలికాడు.
… @allu_arjun గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైం లో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి @PawanKalyan
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు @tarak9999 , @AlwaysRamCharan కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది.దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022
"అల్లు అర్జున్ గురించి నా ట్వీట్స్ అన్నీ నా వోడ్కా టైం లో పెట్టాను కానీ.. నేను ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్ నా కాఫీ టైం లో పెడుతున్నా. దీన్ని బట్టి నా సీరియస్ నెస్ ని అర్థం చేసుకోండి" అని చెప్పుకొచ్చాడు. "ఎప్పుడో మీ తర్వాత వచ్చిన పిల్లలు తారక్, రామ్ చరణ్ తేజ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతూ ఉంటే, మీరు ఇంకా ఒట్టి తెలుగు ని పట్టుకుని వేలాడటం మీ ఫ్యాన్స్ అయిన మాకు కన్నీటి ప్రాయంగా ఉంది. దయచేసి భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా తీసుకెళ్ళి మీరే సబ్కా బాప్ అని ప్రూవ్ చెయ్యండి" అని అన్నాడు వర్మ. "ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా పవన్ కళ్యాణ్ గారూ???" అంటూ ట్వీట్లలో చెప్పుకొచ్చాడు వర్మ.
ఇంటీరియర్ ఆంధ్ర లో జరిగిన పుష్ప సబ్జెక్ట్ పాన్ ఇండియా సబ్జెక్ట్ అయినప్పుడు, కొమరం భీమ్, అల్లూరి లాంటి తెలుగు వీరుల సబ్జెక్ట్ పాన్ ఇండియా అయినప్పుడు, భీమ్లా నాయక్ సబ్జెక్ట్ పాన్ వరల్డ్ సబ్జెక్ట్ కాదంటారా @pawanKalyan గారూ???
— Ram Gopal Varma (@RGVzoomin) January 31, 2022