దుమ్మురేపుతున్న పవర్ స్టార్ 'వకీల్ సాబ్' టీజర్
Pawan Kalyan Vakeel Saab Teaser Released. పండుగ పూట ఫ్యాన్స్ ఎగిరే గంతేసే సర్‌ఫ్రైజ్ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్
By Medi Samrat Published on
15 Jan 2021 3:02 AM GMT

పండుగ పూట ఫ్యాన్స్ ఎగిరే గంతేసే సర్‌ఫ్రైజ్ ఇచ్చారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. రాజకీయాలలోకి వచ్చి సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన పవన్ హీరోగా.. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'వకీల్ సాబ్'. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను గురువారం విడుదల చేశారు.
టీజర్‌లో 'కోర్టులో వాదించడమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు' అంటూ పవన్ చెప్పిన పవర్‌పుల్ డైలాగ్ అలరిస్తోంది. బాలీవుడ్ హిట్ సినిమా 'పింక్' రీమేక్‌గా 'వకీల్ సాబ్' తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ న్యాయవాది పాత్రలో కనిపిస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ సరసన కథానాయికగా శ్రుతిహాసన్ నటిస్తుంది. ఇంకా అంజలి, నివేదా, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తుండగా.. దిల్ రాజు నిర్మించారు.
Next Story