పవన్ కళ్యాణ్ కు మోహన్ బాబు రిప్లై.. కాస్త సెటైర్ గా..

Mohan Babu Reply On Pawan Comments. రిపబ్లిక్ సినిమా ఆడియో ఫంక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో సంచలన వ్యాఖ్యలు

By Medi Samrat
Published on : 26 Sept 2021 5:12 PM IST

పవన్ కళ్యాణ్ కు మోహన్ బాబు రిప్లై.. కాస్త సెటైర్ గా..

రిపబ్లిక్ సినిమా ఆడియో ఫంక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నో సంచలన వ్యాఖ్యలు చేశారు. వకీల్ సాబ్ సినిమా లేకుంటే.. ఏపీలో సినిమాలు రిలీజ్ అయ్యుండేవని పవన్ వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ పెట్టుబడితో మేము సినిమాలు చేస్తుంటే, ప్రభుత్వం కంట్రోల్ చేయడమేంటి? అని పవన్ ప్రశ్నించారు. సినిమా టికెట్ ఆన్లైన్ సేల్ పై పవన్ మండిపడ్డారు. వైసీపీ మద్దతుదారుడైన మోహన్ బాబుపై కూడా సినిమా టికెట్ ఆన్లైన్ విక్రయాలకు ఒకే చెప్తే.. మీ విద్యానికేతన్ లో సీట్లు కూడా.. ప్రభుత్వమే ఆన్లైన్ లో భర్తీ చేస్తుందని మీకు ఓకేనా అంటూ పవన్ ప్రశ్నించారు.

నిర్మాత దిల్ రాజుతో మాట్లాడుతూ నువ్వు రెడ్డే సీఎం జగన్ రెడ్డే.. మీరు మీరు తేల్చుకోండి. మీ రెడ్డే కదా, వెళ్లి మాట్లాడూ అంటూ కామెంట్లు చేశారు. పరిశ్రమలో ఉన్న మీరు ఏ పార్టీకైనా మద్దతు ఇవ్వండి. ఆ పార్టీలలో ఉండి నన్ను తిట్టండి. అలా కొందరు తిట్టారు కూడా. కానీ పరిశ్రమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించండి అని పవన్ కోరారు. నటుడు మోహన్ బాబు లాంటి వారు పరిశ్రమలో పెద్దలుగా వైసీపీ నిరంకుశ నిర్ణయాల పట్ల స్పందించాలని అన్నారు. పరిశ్రమ అంటే కేవలం దిల్ రాజు, సురేష్ బాబు, అల్లు అరవింద్ కాదని, పరిశ్రమపై ఆధారపడిన ప్రతి ఒక్కరు అన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక మంది చిత్ర పరిశ్రమపై ఆధారపడి బ్రతుకుతున్నారని పవన్ అన్నారు. సినీ రంగ సమస్యలపై మోహన్ బాబు వంటి పెద్దలు స్పందించాలని, ఏపీలో తన బంధువులైన వైసీపీ నాయకులతో మాట్లాడి చిత్ర పరిశ్రమను హింసించొద్దని మోహన్ బాబు చెప్పాలని పవన్ కోరారు.

తాజాగా దీనిపై మోహన్ బాబు స్పందించారు. నా ప్రియమైన పవన్ కల్యాణ్ అంటూ ఓ ప్రకటన చేశారు. 'నా చిరకాల మిత్రుని సోదరుడైన పవన్ కళ్యాణ్ నువ్వు నాకంటే చిన్నవాడివి అందుకని ఏకవచనంతోనే సంబోధించాను. పవన్ కళ్యాణ్ గారు అనడంలో కూడా తప్పేమీ లేదు. చాలా కాలానికి నన్ను మెల్లగా లాగావ్. సంతోషమే. ఇప్పుడు మా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. నా కుమారుడు విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా నిలబడ్డాడు అన్న సంగతి నీకు తెలిసిందే. అక్టోబర్ 10న తేదీన ఎలక్షన్స్ అయిపోతాయి. ఆ తరువాత నువ్వు అడిగిన ప్రతీ మాటకి నేను హృదయపూర్వకంగా సమాధానం చెబుతాను. ఈ లోగా నువ్వు చేయవలసిన ముఖ్యమైన పని.. నీ అమూల్యమైన ఓటుని నీ సోదర సమానుడైన విష్ణుబాబుకి అతని ప్యానల్‌కి వేసి వాళ్లని గెలిపించాలని కోరుకుంటున్నాను' అంటూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.


Next Story