Keerthi Reddy Father Passed Away. తొలిప్రేమ.. ఈ పేరు వింటే చాలు పవన్ కళ్యాణ్, అందులో హీరోయిన్ కీర్తి రెడ్డి గుర్తుకు వస్తారు.
By Medi Samrat Published on 15 May 2021 12:02 PM GMT
తొలిప్రేమ.. ఈ పేరు వింటే చాలు పవన్ కళ్యాణ్, అందులో హీరోయిన్ కీర్తి రెడ్డి గుర్తుకు వస్తారు. కీర్తి రెడ్డి కెరీర్ స్టార్టింగ్ లోనే అంత పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చినా కూడా ఆమె హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. కీర్తి రెడ్డికి 2004లో హీరో సుమంత్‌తో వివాహం జరగ్గా 2006లో ఈ జంట విడాకులు తీసుకున్నారు. కీర్తి మరో పెళ్లి చేసుకొని బెంగుళూరులో స్థిరపడ్డారు. మహేష్ బాబు అక్కగా 'అర్జున్' సినిమాలో కూడా కీర్తి రెడ్డి నటించారు. ప్రస్తుతానికి ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
కీర్తి రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె బాబాయ్, టీఆర్‌ఎస్ నాయకుడు కేశ్‌పల్లి (గడ్డం) ఆనందరెడ్డి శుక్రవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 60 సంవత్సరాలు. గుండెనొప్పితో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిట్‌లో అడ్మిట్ అయిన కొంత సమయానికే ఆయన తుదిశ్వాస విడిచారు. ఆనందరెడ్డి నిజామాబాద్ మాజీ ఎంపీ కేశ్‌పల్లి గంగారెడ్డి తనయుడు. 2014లో నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018 ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆనందరెడ్డి మృతి పట్ల పలువురు దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.