కాలిన‌డ‌క‌న తిరుమ‌లకు బుల్లితెర క‌మ‌ల్ హాసన్

Getup Srinu Climb Tirumala Hills. జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్‌, బుల్లితెర క‌మ‌ల్ హాసన్‌గా పాపుల‌ర్ అయిన‌ గెట‌ప్ శ్రీను

By Medi Samrat  Published on  23 Jan 2021 4:56 AM GMT
కాలిన‌డ‌క‌న తిరుమ‌లకు బుల్లితెర క‌మ‌ల్ హాసన్
జ‌బ‌ర్ధ‌స్త్ క‌మెడీయ‌న్‌, బుల్లితెర క‌మ‌ల్ హాసన్‌గా పాపుల‌ర్ అయిన‌ గెట‌ప్ శ్రీను.. కాలిన‌డ‌క‌న తిరుమ‌ల‌ శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్లాడు. ఈ విష‌యమై త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ‌తిరుమల మెట్లెక్కుతున్న ఫొటోను అభిమానుల‌తో షేర్ చేసుకున్నాడు. గెట‌ప్ శ్రీను వెంట నటుడు, రేడియో జాకీ హేమంత్ కూడా ఉన్నాడు.


సుడిగాలి సుధీర్ టీమ్ కంటెస్టెంట్ అయిన గెట‌ప్ శ్రీను.. స్కిట్స్‌లో వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషిస్తూ ప్రేక్ష‌కుల‌ని ఫుల్ ఎంట‌ర్‌టైన్ చేస్తాడు. ముఖ్యంగా ఆటో రాంప్రసాద్, సుడిగాలి సుధీర్ తో క‌లిసి ఈయ‌న చేసే కామెడీ.. ప్రేక్ష‌కులను క‌డుపుబ్బ న‌వ్విస్తుంది. ఈ క్ర‌మంలోనే వైవిధ్య‌మైన పాత్ర‌లు పోషించి బుల్లితెర క‌మ‌ల్ హాస‌న్‌గా పేరు గ‌డించాడు.

గెట‌ప్ శ్రీను బుల్లితెర‌పై అల‌రిస్తూనే అడ‌పాద‌డ‌పా వెండితెర‌పై కూడా మెరుస్తున్నాడు. త‌న మిత్రులు రాంప్ర‌‌సాద్, సుధీర్‌ల‌తో‌ క‌లిసి చేసిన 3 మంకీస్ ద్వారా హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు. అలాగే రంగ‌స్థ‌లం, రాజు గారి గ‌ది-3, ఇస్మార్ట్ శంక‌ర్‌, మ్యాగ్నెట్‌, గుండ‌మ్మ క‌థ‌, రాయ‌ల‌సీమ ల‌వ్‌స్టోరీ, స‌మీర‌మ్ వంటి చిత్రాల‌లో న‌టించాడు.
Next Story