ఇక‌పై నా బాస్‌ని అలాగే పిలుస్తాను.. భక్త కన్నప్ప కూడా పరమేశ్వరుడిని అలాగే..

Bandla Ganesh Tweet About Pawan Kalyan. న‌టుడు, ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తన‌ అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్

By Medi Samrat  Published on  28 Jun 2021 8:27 AM IST
ఇక‌పై నా బాస్‌ని అలాగే పిలుస్తాను.. భక్త కన్నప్ప కూడా పరమేశ్వరుడిని అలాగే..
న‌టుడు, ప్రముఖ టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ తన‌ అభిమాన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరును మార్చేశాడు. ఎన్నో ఆడియో పంక్ష‌న్‌ల‌లో గ‌ణేష్‌.. ప‌వ‌న్‌ను త‌న‌ దేవుడిగా అభివ‌ర్ణించాడు. తాజాగా తన దేవుడైన ప‌వ‌న్‌పై భక్తిని మరోసారి చాటుకున్నాడు గ‌ణేష్‌. ట్విట‌ర్ వేదిక‌గా.. పవన్ తో ఉన్న పిక్ ను షేర్ చేసుకున్న బండ్ల గ‌ణేష్‌.. ఇప్పటి నుంచి తన దేవుడిని "దేవర" అని పిలుస్తానని వెల్లడించాడు.

ఈ మేరకు 'నా దేవర తో నేను.. భక్త కన్నప్ప పరమేశ్వరడుని దేవర అని పిలుచుకునేవారు. నేను కూడా ఈరోజు నుంచి నా బాస్ ని 'దేవర' అని పిలుస్తాను' అంటూ ట్వీట్ చేశాడు. తాను అయ్యప్ప మాల ధ‌రించిన‌పుడు పవన్ తో దిగిన ఫోటోను ట్వీట్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్ అవుతోంది.

ఇక కమెడియన్ నుంచి నిర్మాతగా మారిన బండ్ల గ‌ణేష్‌.. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు. కొద్దిరోజుల‌కే తాను రాజకీయాల్లో ఉండ‌లేన‌ని యూట‌ర్న్ తీసుకున్నారు. అనంత‌రం సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్సులో మొద‌ట‌గా మహేష్ బాబు.. స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో న‌టించిన బండ్ల గ‌ణేష్‌.. నిర్మాత‌గా పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి పావులు క‌దుపుతున్న‌ట్లు స‌మాచారం.


Next Story