మెదక్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అన్నదమ్ములు మృతి.. బడికి వెళ్తుండగా ఘటన
Three brothers died in road accident in Telangana's medak . మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన ఓ బైక్‌ను లారీని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అన్నదమ్ములు మృతి
By అంజి Published on
20 Dec 2021 8:52 AM GMT

మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన ఓ బైక్‌ను లారీని ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు. జిల్లా పరిధిలోని చేగుంట సమీపంలో సోమవారం ఉదయం ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. చేగుంట మండలం ఉల్లి తిమ్మాయపల్లికి చెందిన రాకేష్ (17), ప్రదీప్ (15), అరవింద్ (14)లు సొంత అన్నదమ్ములు. చేగుంటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రదీప్, అరవింద్ చదువుతున్నారు. రోజు వారిలాగే ప్రదీప్, అరవింద్‌లు ఇవాళ స్కూల్‌కు బయల్దేరారు.
వారిని అన్న రాకేష్ బైక్‌పై పాఠశాలకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే రోడ్డు ప్రమాదం జరిగింది. సమీపంలోనే చేగుంటకు రాగానే అదుపు తప్పిన బైక్.. లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో రాకేష్ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ప్రదీప్, అరవింద్‌లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రదీప్, అరవింద్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story