Fact Check : టీడీపీ సోషల్ మీడియా బాధ్యతలను టిక్ టాకర్ అనూష ఉండవల్లి తీసుకోనుందా..?
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Jun 2020 10:20 AM GMTటిక్ టాక్ వీడియోల ద్వారా అనూష ఉండవల్లి ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వాన్నికి వ్యతిరేకంగా వీడియోలను చేయడం మొదలుపెట్టారు. ఆమె మాట్లాడిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. పలువురు టీడీపీ కార్యకర్తలు ఆమె చేసిన వీడియోలను స్టేటస్ లుగా పెట్టుకోవడం, సోషల్ మీడియాలో షేర్ లు చేయడం చేస్తూ వస్తున్నారు.
టీడీపీ సోషల్ మీడియా వింగ్ కు హెడ్ గా అనూష ఉండవల్లిని పెట్టారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ ఓపెన్ లెటర్ వైరల్ అవుతోంది. జూన్ 11, 2020కి సంబంధించిన లెటర్ అంటూ.. అందులో టీడీపీ జనరల్ సెక్రెటరీ నారా లోకేష్ సంతకం కూడా ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎదుర్కొంటూ తెలుగుదేశం పార్టీని పటిష్టపరిచేందుకు పోరాడుతున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. పార్టీ నుండి ఈ మధ్య కాలంలో కొందరు పార్టీ బాగున్నప్పుడు పదవులు అనుభవించి అధికారం పోగానే పార్టీ మారే నీచులకు బుద్ధి చెప్పాలి. ఎంతోమందిని తయారు చేసి చట్టసభలకు మరియు అనేక పదవులు కల్పించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఎవ్వరూ అధైర్యపడాల్సిన అవసరం లేదు. పార్టీ కోసం కష్ట కాలంలో నిలబడిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటుంది పార్టీ.
ఈ మధ్యన సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ తరపున మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వున్నందుకు కేసులు మోపారు. అన్నిటికి సమాధానం చెప్తూ గట్టిగా నిలబడిన మహిళా సోదరి అనూష ఉండవల్లి గారికి పార్టీ సోషల్ మీడియా బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాం. తక్షణమే ఆమెను పార్టీ అప్పగించిన బాధ్యతలు తీసుకుని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరుకుంటూ ఉన్నాం.
తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం మొత్తమ్ అనూష ఉండవల్లి గారి ఆధ్వర్యంలో ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ వున్నాను. పార్టీ బలోపేతానికి తోడ్పడుతారు అని ఆశిస్తున్నామంటూ.. కింద నారా లోకేష్ సంతకం ఉంది. ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది.
ఎంతో మంది ఫేస్ బుక్ యూజర్లు దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.
నిజ నిర్ధారణ:
పైన చెప్పినదంతా 'పచ్చి అబద్ధం'
టీడీపీ జనరల్ సెక్రెటరీ నారా లోకేష్.. ఈ వార్తలను ఖండించారు. టీడీపీ పార్టీ లెటర్ అంటూ వైరల్ అవుతున్నది ఫేక్ అని ఆయన తేల్చేశారు. ట్వీట్ చేసి తప్పుడు లెటర్ అని పోస్ట్ చేశారు.
ఫేక్ బతుకులు మారవు. @ysjagan వేసే 5 రూపాయిల చిల్లర కోసం సొంత తల్లి పై తప్పుడు పోస్ట్ పెట్టే నీచ స్థాయికి దిగజారిపోయింది వైకాపా పేటిఎం బ్యాచ్. యుద్ధం డైరెక్ట్ గా చేసే దమ్ములేని దద్దమ్మ జగన్ ఇలాంటి చెత్త పనులు చేయించి పైశాచిక ఆనందం పొందుతున్నారు అని నారా లోకేష్ ట్వీట్ చేశారు.
టీడీపీ సపోర్టర్ అయిన అనూష ఉండవల్లి కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో వైరల్ అవుతున్న లెటర్ ను పోస్టు చేసి.. అది ఫేక్ వార్తలు అని తేల్చి చెప్పేసారు.
అనూష ఉండవల్లిని టీడీపీ సోషల్ మీడియా వింగ్ కు హెడ్ గా నియమించారన్నది 'పచ్చి అబద్ధం'.