నిజమెంత : లాక్‌డౌన్‌ను అమలుచేయాలని అనుకుంటున్నామని మంత్రి తలసాని చెప్పారా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Jun 2020 9:35 AM GMT
నిజమెంత : లాక్‌డౌన్‌ను అమలుచేయాలని అనుకుంటున్నామని మంత్రి తలసాని చెప్పారా..?

భారత్ లో రెండు నెలల పాటూ లాక్ డౌన్ ను అమలుచేశారు. ప్రస్తుతం ఒక్కొక్కటిగా లాక్ డౌన్ ను సడలిస్తూ వస్తున్నారు. ఇంతలో మరోసారి లాక్ డౌన్ ను పొడిగించే అవకాశం అంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. తాజాగా తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్ఎంటీవీ తో మాట్లాడుతూ లాక్ డౌన్ ను మరోసారి పొడిగించబోతున్నామని తెలిపినట్లుగా స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో రెండు రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని చెప్పబోతున్నారంటూ వార్తలను వైరల్ చేయడం మొదలుపెట్టారు.

ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన బ్రేకింగ్ ప్లేట్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లాక్ డౌన్ ను కొనసాగిస్తారేమో ఇంకోసారి అంటూ ప్రజలు తెగ టెన్షన్ పడుతున్నారు.

T1

పలువురు ఈ స్క్రీన్ షాట్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.నిజ నిర్ధారణ:

సదరు టీవీ ఛానల్ కు సంబంధించిన బ్రేకింగ్ ప్లేట్స్ అంటూ వైరల్ అవుతున్న ఫోటోలు ప్రజలను తప్పుద్రోవ పట్టిస్తున్నాయి. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదు.

తలసాని శ్రీనివాస్ యాదవ్ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ తెలంగాణకు సంబంధించిన చాలా అంశాల గురించి మాట్లాడారు. హైదరాబాద్ లో ఒక కోటికి పైగా జనాభా ఉంటుందని.. తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ నుండి వెసులుబాటు కల్పించినప్పటికీ.. ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

లాక్ డౌన్ ను మళ్లీ అమలు చేసే అవకాశం ఏమైనా ఉందా అని ఆయన్ను అడుగగా.. ఆ నిర్ణయాలు ముఖ్యమంత్రి తీసుకుంటారు అని చెప్పేసారు.

ఆ తర్వాత మరిన్ని విషయాలను తలసాని మాట్లాడారు. బీజేపీ గురించి కూడా ఆయన మాట్లాడారు.. అంతేకానీ పూర్తీ లాక్ డౌన్ గురించి ఆయన ఎక్కడ కూడా ప్రస్తావించలేదు.

T2

ఇలాంటి వదంతులపై తర్వాత ఓ పత్రికా ప్రకటనను కూడా విడుదల చేయడం జరిగింది.

ఆ బ్రేకింగ్ టెంప్లేట్స్ ప్రజలను తప్పుద్రోవ పట్టించేలా ఉన్నాయి తప్పితే.. తలసాని ఎక్కడ కూడా తెలంగాణలో లాక్ డౌన్ ను అమలు చేస్తారని చెప్పలేదు. పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ అటువంటి నిర్ణయాలు తీసుకుంటారని ఆయన అన్నారు.

Claim Review:నిజమెంత : లాక్‌డౌన్‌ను అమలుచేయాలని అనుకుంటున్నామని మంత్రి తలసాని చెప్పారా..?
Claim Fact Check:false
Next Story